ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Court warning: కోర్టులో రాజకీయ ప్రసంగం.. ఎంపీని తీవ్రంగా మందలించిన కోర్టు

ABN, First Publish Date - 2023-10-14T15:26:10+05:30

కోర్టులో అప్రస్తుత ప్రసంగం చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ పై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్‌ను శనివారంనాడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజకీయ ప్రసంగాలు చేయవద్దని కోర్టు హెచ్చరించింది.

న్యూఢిల్లీ: కోర్టులో అప్రస్తుత ప్రసంగం చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత సంజయ్ సింగ్‌ (Sanjay Singh)పై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్‌ను శనివారంనాడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.


కోర్టురూమ్‌లో విచారణ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ పేరును సంజయ్ సింగ్ ప్రస్తావించారు. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ అగ్రహం వ్యక్తం చేశారు. అదానీ గురించి, మోదీ (ప్రధానమంత్రి) గురించి ప్రసంగించాలనుకుంటే ఇప్పట్నించి మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరపరచాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కేసుకు సంబంధం లేని అనవసర ప్రస్తావన చేయవద్దని హెచ్చరించారు.


అదానీపై తాను చేసిన ఫిర్యాదును దర్యాప్తు సంస్థ పట్టించుకోవడం లేదని సంజయ్ సింగ్ ఆరోపించారు. కస్టడీ విచారణలో సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. మీ తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు, భార్య అకౌంట్‌కు రూ.10,000 ఎందుకు పంపారు అంటూ ఏజెన్సీ ప్రశ్నిస్తోందన్నారు. ఈడీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిందన్నారు. అబద్ధాలు వెంట అబద్ధాలాడుతోందని ఆరోపించారు. అదానీపై తాను ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేని కోర్టుకు సంజయ్ సింగ్ తెలిపారు.


రెండువారాల పాటు సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరడంతో అక్టోబర్ 27 వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. వ్యాపారి దినేష్ అరోరా, అప్పటి ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా మధ్య మీటింగ్‌ను సంజయ్ సింగ్ ఏర్పాటు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. దినేష్ అరోరా, సిసోడియాలను ఈడీ, సీబీఐ ఇప్పటికే అరెస్టు చేశాయి. కాగా, సంజయ్ సింగ్‌పై 3 ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ, ఇంతవరకూ ఈ కేసులో సంజయ్ సింగ్ పేరు చేర్చడం కానీ, ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు సమన్లు పంపడం కానీ చేయలేదు.

Updated Date - 2023-10-14T15:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising