ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament Monsoon Session: రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ సస్పెన్షన్

ABN, First Publish Date - 2023-07-24T14:21:00+05:30

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం అట్టుడికిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాల పట్టువిడుపులు లేని వైఖరి ప్రదర్శిస్తుండటం, పార్లమెంటు వెలుపల నిరనసలకు దిగుతుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది.

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ (Manipur) అంశం అట్టుడికిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాల పట్టువిడుపులు లేని వైఖరి ప్రదర్శిస్తుండటం, పార్లమెంటు వెలుపల నిరనసలకు దిగుతుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh)పై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటు సమావేశాలు ముగిసేంత వరకూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కఢ్ ప్రకటించారు. సభలో 'అనుచిత ప్రవర్తన' కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని సభానేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టరు. దీనిని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.


పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు సంజయ్ సింగ్ అనుచిత ప్రవర్తనపై ధన్‌కఢ్ ఆయనను హెచ్చరించారు. సంజయ్ సింగ్ సస్పెన్షన్ అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ చైర్మన్ వాయిదా వేశారు. మణిపూర్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్‌ఎస్‌ తదితర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి.


నిజం మాట్లాడినందుకే వేటు: ఆఫ్

సంజయ్ సింగ్ సస్పెన్షన్‌పై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఘాటుగా స్పందించారు. నిజం మాట్లాడినందుకే సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేశారని, ఇందుకు తాము మనస్తాపం చెందడం లేదని చెప్పారు. ఈ అంశాన్ని తమ లీగల్ టీమ్ చూసుకుటుందని అన్నారు. పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యేంతవరకూ సస్పెన్షన్ వేటు వేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాగా, సంజయ్ సింగ్ సస్పెన్షన్‌పై విపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ను కలుసుకోనున్నారు.

Updated Date - 2023-07-24T14:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising