ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coal Scam: అభిషేక్ బెనర్జీ భార్యకు విమానాశ్రయంలో చేదు అనుభవం

ABN, First Publish Date - 2023-06-05T14:20:32+05:30

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిర నరుల బెనర్జీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న రుజిరను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వాదం అనంతరం ఆమె విమానాశ్రయం విడిచిపెట్టి వెళ్లిపోయారు.

కో‌ల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) భార్య రుజిర నరుల బెనర్జీకి (Rujira Narula Banerjee) నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న రుజిరను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె విమానాశ్రయానికి వచ్చారు. ఆమెను విమానం ఎక్కకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో అధికారులతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె విమానాశ్రయం విడిచిపెట్టి వెళ్లిపోయారు. బొగ్గు కుంభకోణంలో రుజిర బెనర్జీని సీబీఐ, ఈడీ గతంలో పలుమార్లు విచారించింది.

రుజిరపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుక్ ఔట్ నోటీసు ఉన్నందున ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించ లేమని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. రుజిర విదేశీ ప్రయాణాలను అడ్డుకోరాదని కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆమెకు రక్షణ కల్పించినట్టు వారు తెలిపారు. కోర్టు ధిక్కారం కింద అభిషేక్ బెనర్జీ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో అభిషేక్ బెనర్జీ పాల్గొంటున్నందున ఉద్దేశపూర్వకంగానే రుజిర బెనర్జీని అడ్డుకున్నట్టు కనిపిస్తోందని వారు అన్నారు.

బీజేపీ కౌంటర్

రుజిర బెనర్జీని చట్టవిరుద్ధంగా అడ్డుకుని ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ ప్రతినిధి సమిక్ భట్టాచార్య అన్నారు. ఏ కారణంపై రుజిరను ఆపారనేది ముందు తెలుసుకోవాలని, సరైన కారణం లేకుండా ఇమిగ్రేషన్ శాఖ అలాంటి చర్యలకు పాల్పడి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-06-05T15:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising