ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nushrath : భారతీయులు సురక్షితం!

ABN, First Publish Date - 2023-10-09T05:29:21+05:30

పాలస్తీనా హమా్‌సతో యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు.

ఇజ్రాయెల్‌ నుంచి సురక్షితంగా వచ్చిన నటి నుస్రత్‌

బెత్లెహాంలో చిక్కుకుపోయిన మేఘాలయ

ఎంపీ కుటుంబాన్ని రప్పించటానికి యత్నాలు

టెల్‌ అవీవ్‌కు ఎయిరిండియా విమానాలు రద్దు

ఇజ్రాయెల్‌లో 18 వేల మంది మనవాళ్లు

జెరూసలేం, న్యూఢిల్లీ, అక్టోబరు 8: పాలస్తీనా హమా్‌సతో యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఆ దేశ పర్యటనకు వెళ్లిన టూరిస్టులు, వ్యాపార పనుల మీద వెళ్లిన వారు కూడా ఉన్నారు. వీరందరూ సురక్షితంగానే ఉన్నారని తెలుస్తోంది. వీరి క్షేమ సమాచారాన్ని అటు ఇజ్రాయెల్‌, ఇటు పాలస్తీనాలోని భారత దౌత్య కార్యాలయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వారిలో రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ వాన్‌వెయిరొయ్‌ ఖార్లుఖితోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఉన్నారు. ఖార్లుఖి మేఘాలయకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన ఎంపీ. జెరూసలేం యాత్ర కోసం ఎంపీ, ఆయన కుటుంబంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మరో 24 మంది కూడా ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ప్రస్తుతం బెత్లెహాంలో చిక్కుకుపోయిన వీరిని సురక్షితంగా స్వదేశానికి రప్పించటానికి మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా భారత విదేశాంగశాఖతో సంప్రదింపుల్లో ఉన్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన నటి నుస్రత్‌ బరూచా ఆదివారం సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్‌లో జరిగిన హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనటానికి ఆమె అక్కడికి వెళ్లారు. ఇదిలా ఉండగా, హమా్‌సతో జరుగుతున్న యుద్ధంలో తమకు మద్దతు ఇచ్చినందుకు భారత్‌కు ఇజ్రాయెల్‌ కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - 2023-10-09T05:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising