ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PSLV-C57 : పీఎస్ఎల్వీ-సీ57 ప్రయోగానికి రేపు కౌంట్‌డౌన్‌

ABN, First Publish Date - 2023-08-31T02:34:59+05:30

భారతదేశపు తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి ఇస్రో చకచకా ఏర్పాట్లు చేస్తోంది...

2న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంతో రాకెట్‌ నింగిలోకి

సూళ్లూరుపేట, బెంగళూరు ఆగస్టు 30: భారతదేశపు తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి ఇస్రో చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్‌ ద్వారా సెప్టెంబరు 2న ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్త్రవేత్తలు లాంచ్‌ రిహార్సల్‌ను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రెండో ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ నుంచి వెన క్కి తీసుకెళ్లి ముందుకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టారు. రాకెట్‌లోని అన్ని దశల పనితీరుని క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. శనివారం ఉదయం 11:50 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్‌ ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించి మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం గురువారం వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. అనంతరం లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సభ్యులు స మావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ 24 గంటల ముందు అనగా శుక్రవారం ఉదయం 11:50 గంటలకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వీఈఎల్‌సీ పేలోడ్‌ను డిజైన్‌ చేసింది మేమే: ఐఐఏ

ఆదిత్య-ఎల్‌1లో ఏర్పాటు చేసిన ఏడు పేలోడ్లలో ఒకటైన విజబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)ని ఇస్రో సహకారంతో తామే డిజైన్‌, అసెంబ్లింగ్‌ చేసి పరీక్షించామని బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ) మంగళవారం వెల్లడించింది. వీఈఎల్‌సీ కోసం హోసకోటెలోని క్రెస్ట్‌ క్యాంప్‌సలో భారీ సైజ్‌ ‘క్లాస్‌ టు క్లీన్‌ రూమ్‌’ను నిర్మించాల్సి వచ్చిందని తెలిపింది.

Updated Date - 2023-08-31T02:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising