ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Barath:వందే భారత్ ప్రారంభించాక.. భారీగా తగ్గిన విమాన ఛార్జీలు

ABN, First Publish Date - 2023-10-23T07:30:32+05:30

దేశంలో రైలు రవాణాను పటిష్ట పరచడం వల్ల విమాన ఛార్జీలు భారీగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వందే భారత్(Vande Barath) రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో సగటున 20 నుంచి 30 శాతం తగ్గాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

ఢిల్లీ: దేశంలో రైలు రవాణాను పటిష్ట పరచడం వల్ల విమాన ఛార్జీలు భారీగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వందే భారత్(Vande Barath) రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో సగటున 20 నుంచి 30 శాతం తగ్గాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల లింగం, వయస్సు ఆధారంగా వందే భారత్ రైళ్ల(Indian Railways) డిమాండ్‌ను రైల్వే శాఖ తొలిసారి పర్యవేక్షిస్తోంది. ముంబయి నుంచి ప్రారంభమయ్యే వందే భారత్ లో అత్యధికులు 31-45 ఏళ్ల వయస్సు గలవారే.. ఆ తరువాతి స్థానంలో 15 - 30 ఏళ్ల వయస్కులు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ 15 - అక్టోబరు 13 మధ్య ముంబయి నుంచి షిర్డీ, గోవా, షోలాపూర్‌ వెళ్లే ప్రయాణికుల(Passengers) సంఖ్య గణాంకాలతో వివరించారు.


మొత్తం 85 వేల 600 మంది పురుషులు, 26 మంది ట్రాన్స్‌జెండర్లు, 57 వేల 838 మంది మహిళలు వందేభారత్ లో ప్రయాణించినట్లు చెప్పారు. సెంట్రల్ రైల్వే (CR) చీఫ్ పీఆర్ఓ శివరాజ్ మనస్పురే మాట్లాడుతూ.. “వందేభారత్ లో పిల్లల సగటు ఆక్యుపెన్సీ (1-14 సంవత్సరాలు) 5% ఉండగా, 4.5% మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వందే భారత్ రైళ్లు ప్రారంభమైన తర్వాత విమాన రాకపోకలు 10-20% మేర, విమాన ఛార్జీలు 20- 30 శాతం తగ్గాయి" అని అన్నారు. వందేభారత్ రైళ్ల పబ్లిక్ కి తెలియజేసేందుకు, ఫుట్‌పాత్ ల సంఖ్య పెంచడానికి రైల్వే శాఖ మార్గాలను అన్వేషిస్తోందని ఆయన అన్నారు. ముంబై నుండి షిర్డీ, మడ్‌గావ్, షోలాపూర్‌లకు వెళ్లే ఈ వందే భారత్ రైళ్లలో సెప్టెంబర్‌లో 77 - 101 శాతం ఆక్యుపెన్సీ ఉందన్నారు. “ఈ డేటా నాన్-ఫేర్ బాక్స్‌ల నుండి ఆదాయాన్ని సంపాదించడంలో రైల్వే శాఖకు ఉపయోగపడుతుంది. వందే భారత్ రైళ్ల సీట్లు, ట్రేలు, హెడ్ రెస్ట్‌లపై ప్రకటనలు ఇవ్వడం ద్వారా వీటి గురించి ప్రజలకి మరింత అవగాహన కల్పించొచ్చు. రైల్వే శాఖ పర్యవేక్షణ ద్వారా వందే భారత్ లో సేవలు, ఆహార మెనూ, ఇతర సౌకర్యాలలో మరిన్ని మార్పులు చేసి.. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం”అని పబ్లిక్ పాలసీ అనలిస్ట్ పరేష్ రావల్ అన్నారు.

Updated Date - 2023-10-23T07:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising