ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AIADMK: అన్నాడీఎంకేలో ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-01-03T09:02:24+05:30

అన్నాడీఎంకే(AIADMK) తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఎంపిక, సర్వసభ్యమండలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సర్వసభ్యమండలి వ్యవహారంపై రేపే సుప్రీంకోర్టు తీర్పు

చెన్నై, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే(AIADMK) తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఎంపిక, సర్వసభ్యమండలి సమావేశం చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం (Former Chief Minister Panneerselvam) సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై బుధవారం తీర్పు రానుంది. ఈ కేసులో మద్రాసు హైకోర్టు థర్మాసనం తమకనుకూలంగా ఇచ్చిన తీర్పునే ఖరారు చేస్తుందని ఈపీఎస్‌ వర్గీయులు చెబుతున్నారు. హైకోర్టు ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా తమకు సానుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుందని ఓపీఎస్‌(OPS) వర్గీయులు పేర్కొంటున్నారు. గతేడాది ఈపీఎస్‌ అధ్యక్షతన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశంలో ఆయనను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను, సర్వసభ్యమండలి సమావేశాన్ని చెల్లదని ప్రకటించాలంటూ ఓపీఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆయనకు అనుకూలంగా, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈపీఎ్‌సకు అనుకూలంగాను తీర్పులిచ్చారు. ఆ నేపథ్యంలో ఓపీఎస్‌ హైకోర్టు థర్మాసనం తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలు పిటిషన్‌పై రెండు మాసాలకు పైగా విచారణ కొనసాగింది. జనవరి నాలుగున తుదివిచారణ జరుగుతుందని సుప్రీం కోర్టు ప్రకటించింది. అదే రోజు విచారణ పూర్తయి తీర్పు వెలువడే అవకాశాలున్నాయని ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం జరుగనున్న తుది విచారణలో ఈపీఎస్‌ తరఫు న్యాయవాదులు రెండు అంశాలను ముఖ్యంగా ప్రస్తావించే అవకాశముంది. ఇటీవల ఈపీఎస్‌(EPS) సంతకంతో సమర్పించిన అన్నాడీఎంకే జమాపద్దులను ఆమోదించి కేంద్ర ఎన్నికల సంఘం తమ వర్గాన్నే అసలైన పార్టీగా గుర్తించిందని వాదించనున్నారు. ఇక రిమోట్‌ ఓటింగ్‌ విధానంపై అభిప్రాయసేకరణ కోసం ఎడప్పాడికి పంపిన లేఖలో ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పేర్కొనటాన్ని కూడా ఉదహరించనున్నారు. ఈ రెండు అంశాలు తమకు అనుకూలమైన తీర్పు వెలువడేందుకు దోహదపడతాయని ఈపీఎస్‌ వర్గీయులు చెబుతున్నారు.

Updated Date - 2023-01-03T09:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising