ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shri Krishna Janmabhoomi case: శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం..

ABN, Publish Date - Dec 14 , 2023 | 04:09 PM

శ్రీకృష్ణ జన్మభూమి కేసులో (Shri Krishna Janmabhoomi case) అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో (Shahi Idgah Complexe) సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలహాబాద్: శ్రీకృష్ణ జన్మభూమి కేసులో (Shri Krishna Janmabhoomi case) అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో (Shahi Idgah Complexe) సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూ పక్షం ‘శ్రీ కృష్ణ విరాజ్‌మాన్’ తరపున దాఖలైన పిటిషన్‌ పరిశీలించి కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది.

ముగ్గురు న్యాయవాదులను కమిషనర్లుగా నియమిస్తూ కోర్టు నిర్ణయించింది. వివాదాస్పద మసీద్ కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. ‘శ్రీ కృష్ణ విరాజ్‌మాన్’ తరుపున దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మథుర డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి బదిలీ అయిన మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలిచింది. మథుర డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అన్నింటినీ అందించాలని హైకోర్టు కోరింది.


షాహీ ఈద్గా మజీద్ కాంప్లెక్స్‌లో అడ్వకేట్ కమిషనర్‌తో సర్వే చేయించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు అనుమతించిందని హిందూ పక్షం తరపున వాదనలు వినిపించిన విష్ణు శంకర్ జైన్ చెప్పారు. సర్వేలో అనుసరించాల్సిన పద్ధతులను ఈ నెల 18న ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా శ్రీకృష్ణుడి మందిరాన్ని కూలగొట్టి షాహి ఈద్గా మసీదు నిర్మించారన్న పిటిషనర్ల వాదనను అలహాబాద్ హైకోర్టు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలావుండగా.. తీర్పు రానుండడం చాలా మంచి విషయమని, సర్వే చాలా కీలకమవుతుందని అయోధ్యలోని శ్రీరామ్ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గురువారం ఉదయం వ్యాఖ్యానించారు. సర్వేలో వాస్తవాలు బయటపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated Date - Dec 14 , 2023 | 05:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising