Amazon rainforest : కూలిన విమానం.. 40 రోజుల తర్వాత చూస్తే...

ABN, First Publish Date - 2023-06-10T09:23:57+05:30

అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో అద్భుతం జరిగింది. విమానం కూలిపోయిన సంఘటనలో నలుగురు బాలలు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Amazon rainforest : కూలిన విమానం.. 40 రోజుల తర్వాత  చూస్తే...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో అద్భుతం జరిగింది. విమానం కూలిపోయిన సంఘటనలో నలుగురు బాలలు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీరు చరిత్రలో నిలిచిపోతారని కొలంబియన్ ప్రెసిడెంట్ గుస్టావో పెడ్రో (Gustavo Pedro) అన్నారు. వీరు సజీవంగా కనిపించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

పెడ్రో ఇచ్చిన ట్వీట్‌లో, యావత్తు దేశానికి చాలా సంతోషం కలిగించే వార్త చెప్తున్నానని తెలిపారు. కొలంబియన్ అడవిలో 40 రోజుల క్రితం అదృశ్యమైన నలుగురు బాలలు సజీవంగా కనిపించారని చెప్పారు. విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నవారిని కాపాడి, సహాయక చర్యలు చేపట్టడం కోసం సైనికులు, స్థానికులు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ నలుగురు బాలలతో సైనికులు, స్థానికులు కలిసి కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ నలుగురు బాలలకు వైద్య సహాయం అందజేస్తున్నట్లు విలేకర్లకు పెడ్రో చెప్పారు. వీరు పునర్జన్మకు ఉదాహరణ అని చెప్పారు. వీరు చరిత్రలో నిలిచిపోతారన్నారు.

ఇంజిన్ వైఫల్యం

సెస్నా సింగిల్ ఇంజిన్ ప్రొపెల్లర్ విమానం మే 1న ఆరుగురు ప్రయాణికులతో బయల్దేరింది. దీని ఇంజిన్‌లో సాంకేతిక లోపం కనిపించడంతో పైలట్ ఎమర్జెన్సీని ప్రకటించారు. మే 1 తెల్లవారుజామున ఆ విమానం కూలిపోయింది. ఆ తర్వాత లెస్లీ జకోబొంబెయిరే మ్యుకుటెయ్ (13), సొలీనీ జకోబొంబెయిరే మ్యుకుటెయ్ (9), టీయెన్ రనోక్యుయె మ్యుకుటెయ్ (4), క్రిస్టిన్ రనోక్యుయె మ్యుకుటెయ్ (పసికందు) మాత్రమే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వీరి తల్లి మగ్దలెనా మ్యుకుటెయ్ వాలెన్సియా, పైలట్, స్థానిక లీడర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రెండు వారాల తర్వాత..

ఈ విమానాన్ని మే 16న కొలంబియన్ రెయిన్ ఫారెస్టులో గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ నలుగురు పిల్లల జాడ కనిపించలేదు. దీంతో సైన్యం నేతృత్వంలో గాలింపు జరిగింది. వీరి కృషి ఫలించి, పిల్లలు సజీవంగా కనిపించారు. దీంతో సైన్యం చాలా సంతోషంగా ట్వీట్ చేసింది. తమ సమష్టి కృషివల్ల ఇది సాధ్యమైందని తెలిపింది. నలుగురు పిల్లలతో సైనికులు, స్థానికులు కలిసి కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి :

Udayanidhi: సీఎం కొడుకు, ఇప్పుడు మంత్రి కూడా అయిన ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఉప ముఖ్యమంత్రి పదవా... తెలియదే!

మహిళలకు మూత్రశాల లేదు మేడం!

Updated Date - 2023-06-10T13:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising