ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

One nation one Election: 8 మంది సభ్యులతో కమిటీ, జాబితాలో అమిత్‍షా, అధీర్, ఆజాద్

ABN, First Publish Date - 2023-09-02T19:38:15+05:30

న్యూఢిల్లీ: 'ఒక దేశం ఒకే ఎన్నిక' కమిటీపై కేంద్ర న్యాయశాఖ ఆదివారంనాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: 'ఒక దేశం ఒకే ఎన్నిక' (One Nation One Election) కమిటీపై కేంద్ర న్యాయశాఖ ఆదివారంనాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind)ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి నియమితులయ్యారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.


పార్లమెంటు ప్రత్యేక సమావేశం

ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో జమిలీ ఎన్నికల ప్రతిపాదనతో ప్రభుత్వం ఉభయసభల ముందుకు రావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ''ఒక దేశం ఒకే ఎన్నిక'' అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇందువల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని కేంద్రం చెబుతోంది.

Updated Date - 2023-09-02T19:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising