BJP: లోక్‌సభకు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ
ABN, First Publish Date - 2023-08-29T11:57:00+05:30
న్యూఢిల్లీ: లోక్‌సభకు ముందస్తుగానే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలవడకముందే మొదటి జాబితా విడుదల కానుంది. తొలి విడతగా 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కమల నాథులు సిద్ధమవుతున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభకు ముందస్తుగానే భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) వెలవడకముందే మొదటి జాబితా (First List) విడుదల కానుంది. తొలి విడతగా 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కమల నాథులు సిద్ధమవుతున్నారు. మొదటి జాబితాలోనే తెలంగాణాలోని 12 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మినీ జమిలీ (Mini Jamili), లోక్ సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరగుతాయని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ముందస్తు అభ్యర్ధుల ప్రకటన కసరత్తు ఆసక్తి రేపుతోంది. 160 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నామనే అంచనాతో చాలా కాలం నుంచి ఆ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ముందుగా బలహీనంగా వున్న నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అదిష్టానం ఇటీవల మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. బీజేపీ చరిత్రలో మొదటిసారిగా షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందస్తు అభ్యర్థుల ప్రకటన వ్యూహాన్ని అమలు చేయాలని కమల నాథులు వ్యూహం రచిస్తున్నారు. అలా చేయడం వల్ల అభ్యర్థుల విజయవకాశాలు మెరుగవుతాయనే అంచనాలో కేంద్ర పార్టీ పెద్దలు ఉన్నారు. 2019లో కూడా బలహీనంగా వున్న నియోజకవర్గాలకు వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఎక్కువ స్థానాల్లో విజయం సాధించామని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. 160 లోక్ సభ నియోజక వర్గాల్లో ఇప్పటికే లోక్ సభ ప్రవాస్ (పర్యటన) కార్యక్రమం పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించిన కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు నివేదికలు రూపొందించారు. ఆ నివేదికలపై ఈ వారంలో బీజేపీ ముఖ్యులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Updated Date - 2023-08-29T11:57:00+05:30 IST