ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kota Student: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 26కి చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2023-09-18T22:10:22+05:30

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం కోటా(Kota) ఎంట్రన్స్ పరీక్షలకు పెట్టింది పేరు. కానీ హాస్టల్(Kota Hostels) గదుల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి(Student) ఆత్మహత్య చేసుకుంది.

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం కోటా(Kota) ఎంట్రన్స్ పరీక్షలకు పెట్టింది పేరు. కానీ హాస్టల్(Kota Hostels) గదుల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి(Student) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని మహూ ప్రాంతానికి చెందిన ఓ బాలిక విషం తాగింది. గమనించిన స్నేహితులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. బాలిక విషం తాగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ భగవత్ సింగ్ హింగర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


తదుపరి విచారణ జరుగుతోంది. తాజా మరణంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న మొత్తం మృతుల సంఖ్య 26కి చేరింది. రెండు రోజుల క్రితం, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కోసం సిద్ధమవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు అర్హత సాధించాలనే ఆశతో ఏటా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు కోటాకి వస్తారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-09-18T22:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising