AR Rahman: నాగూర్‌ దర్గాలో ఏఆర్‌. రెహ్మాన్‌

ABN, First Publish Date - 2023-01-05T10:33:07+05:30

నాగపట్టణం జిల్లాలోని ప్రసిద్ధగాంచిన నాగూర్‌ దర్గాను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్‌(AR Rahman)

AR Rahman: నాగూర్‌ దర్గాలో ఏఆర్‌. రెహ్మాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆటో రిక్షాలో ప్రయాణం

అడయార్‌(చెన్నై), జనవరి 4: నాగపట్టణం జిల్లాలోని ప్రసిద్ధగాంచిన నాగూర్‌ దర్గాను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్‌(AR Rahman) సందర్శించారు. ఈ దర్గాలో ఎంతో వైభవంగా నిర్వహించే కందూరి ఫెస్టివల్‌తో పాటు గంధ మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాగూర్‌కు కారులో వెళ్ళిన ఆయన సాధారణ భక్తుడిలా దర్గా వరకు ఆటో రిక్షాలో వెళ్లారు. ఆయన వెంట మరో ఆటోలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వెళ్ళారు. దర్గా వద్ద ఆటోలో దిగిన తర్వాత స్థానికులు రెహ్మాన్‌ను గుర్తించి ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు చుట్టుముట్టారు. అయితే, ప్రజల రద్దీ పెరగకముందే ఆయన సెక్యూరిటీ దర్గా ప్రాంగణంలోకి తీసుకెళ్లింది. అనంతరం అక్కడ జరిగిన గంధమహోత్సవ వేడుకల్లో రెహ్మాన్‌ పాల్గొన్నారు. కాగా, నాగూర్‌ దర్గాలో కందూరి ఫెస్టివల్‌ 14 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినాలను పురస్కరించుకుని దర్గాకు వచ్చిన రెహ్మాన్‌ అల్లా ఆశీస్సులు అందుకున్నారు. గత నెలలో నెలలో కూడా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కడపలోని అమీన్‌ దర్గాకు రెహ్మాన్‌ వెళ్ళిన విషయం తెల్సిందే.

Updated Date - 2023-01-05T10:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising