‘Aatmanirbhar’ boost : ఐఎన్ఎస్ మార్ముగావ్ పనితీరు భేష్
ABN, First Publish Date - 2023-05-14T14:41:35+05:30
భారత నావికా దళం (Indian Navy) ఇటీవల ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ మార్ముగావ్ (INS Mormugao) ఆదివారం తొలిసారి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్
న్యూఢిల్లీ : భారత నావికా దళం (Indian Navy) ఇటీవల ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ మార్ముగావ్ (INS Mormugao) ఆదివారం తొలిసారి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిసైల్ నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మార్ముగావ్, దీనిలోని ఆయుధాలు స్వదేశీ కావడం విశేషం. స్వయం సమృద్ధ (Atmanirbhar) భారత దేశం కార్యక్రమంలో భాగంగా వీటిని తయారు చేశారు. ఇవి సముద్రంలో భారత నావికా దళం సత్తాను చాటుతున్నాయి.
2022 డిసెంబరు 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తదితర ఉన్నతాధికారుల సమక్షంలో నాలుగు విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లను జల ప్రవేశం చేయించారు. వీటిలో రెండోది ఐఎన్ఎస్ మార్ముగావ్. దీనిని భారత నావికా దళంలోని వార్‌షిప్ డిజైన్ బ్యూరోలో డిజైన్ చేసి, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించారు.
అత్యాధునిక ఆయుధ వ్యవస్థ
గోవాలోని మార్ముగావ్ నౌకాశ్రయం పేరును ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్‌కు పెట్టారు. 15బీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల ప్రాజెక్టులో ఐఎన్ఎస్ మార్ముగావ్ రెండోది. దీనిలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను ప్రయోగించవచ్చు. ఆధునిక నిఘా రాడార్ కూడా దీనిలో ఉంది. జలాంతర్గాములపై దాడి చేయగలిగే సత్తా కూడా దీనికి ఉంది. మన దేశంలోనే తయారు చేసిన టార్పెడో లాంచర్స్, రాకెట్ లాంచర్స్ వంటివి ఉన్నాయి. జీవసంబంధ, రసాయనిక, అణ్వాయుధాలతో పోరాడే సామర్థ్యం కూడా దీనికి ఉంది. టెక్నాలజీపరంగా చూసినపుడు ప్రపంచంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన మిసైల్ క్యారియర్లలో ఇదొకటి.
ఇవి కూడా చదవండి :
Karnataka Election Results : అతి తక్కువ ఓట్లతో గెలుపు.. అవాక్కయిన ప్రత్యర్థులు..
Maharashtra : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. పలువురు పోలీసులకు గాయాలు..
Updated Date - 2023-05-14T14:41:35+05:30 IST