Badrinath snowfall: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో మంచు మొదలైంది..
ABN, First Publish Date - 2023-10-16T20:36:26+05:30
బద్రీనాథ్, కేదార్నాథ్ లో ఈ సీజన్‌లో తొలిసారి మంచుకురవడం మొదలైంది. ఆదివారంనాడు మంచుకురవడం మొదలుకావడంతో చల్లటి వాతావరణం భక్తుల్లో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపింది. నవరాత్రి తొలిరోజునే వర్షంతో పాటు మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది.
డెహ్రాడూన్: పుణ్య కేత్రాలుగా, పర్యాటక ప్రాంతాలుగా పేరున్న బద్రీనాథ్, కేదార్నాథ్ (Badrainath and Kedarnath)లో ఈ సీజన్‌లో తొలిసారి మంచుకురవడం మొదలైంది. ఆదివారంనాడు మంచుకురవడం మొదలుకావడంతో చల్లటి వాతావరణం భక్తుల్లో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపింది. నవరాత్రి తొలిరోజునే వర్షంతో పాటు మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది. కేథార్ లోయ మొత్తం తెల్లటి మంచుతెర పరుచుకుంది. సుమారు 2 గంటల సేపు ఈ వాతావరణం కనిపించింది.
కశ్మీర్‌లో గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రత
అటు, కశ్మీర్ లోయలోనూ సోమవారం మంచు దట్టంగా కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు చెబుతున్నారు. రోడ్లు, ఇళ్లు మంచుదుప్పటి కప్పుకున్నాయి. కుప్వారా జిల్లా సదానహ్ టాప్‌లో తాజా హిమపాతం చోటుచేసుకుంది. దీంతో బుంగుస్, నౌగామ్, కుప్వారా వంటి పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Updated Date - 2023-10-16T20:36:26+05:30 IST