ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Basavaraj Bommai: గుండె శస్త్రచికిత్సతో కోలుకుంటున్న మాజీ సీఎం.. ఆరోగ్యం వాకబు చేసిన పీఎం

ABN, First Publish Date - 2023-10-22T20:52:59+05:30

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కోలుకుంటున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనరో ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్టింగ్ సర్జరీ చేయించుకున్న ఆయన త్వరలోనే తాను పూర్తిగా కోలుకుంటానని, ప్రజాసేవకు పునరంకితమవుతానని ఆదివారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు.

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) కోలుకుంటున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనరో ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్టింగ్ సర్జరీ (CABG) చేయించుకున్న ఆయన త్వరలోనే తాను పూర్తిగా కోలుకుంటానని, ప్రజాసేవకు పునరంకితమవుతానని ఆదివారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.


''ఈరోజు శుభ అష్టమి. నాకు లక్కీ డే కూడా. ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న నాకు ప్రధానమంత్రి ఫోన్ చేసి క్షేమసమాచారం అడిగారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో నాలో ఆత్మస్థైర్యం మరింత ఇనుమడించింది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాసేవకు పునరంకితమవుతాను'' అని బొమ్మై ఆ ట్వీట్‌లో తెలిపారు.


దీనికి ముందు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు ఆసుపత్రికి వెళ్లి బొమ్మైని కలుసుకున్నారు. కాగా, 63 ఏళ్ల బొమ్మై వేగంగా రికవరీ అవుతున్నారని, మరో రెండు వారాల్లో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-10-22T21:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising