ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodya: అయోధ్య చేరుకున్న భారీ గంట.. ఎన్ని కిలోల బరువో తెలుసా?

ABN, Publish Date - Dec 28 , 2023 | 05:45 PM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య(Ayodya)లో నిర్మిస్తున్న శ్రీ రామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామమందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న ఐదేళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు(Lord Rama) ఆలయంలో కొలువుదీరనున్నాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో.. అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకూ అన్నే విశేషాలున్నాయి.

అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య(Ayodya)లో నిర్మిస్తున్న శ్రీ రామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామమందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న ఐదేళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు(Lord Rama) ఆలయంలో కొలువుదీరనున్నాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో.. అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకూ అన్నే విశేషాలున్నాయి. దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు.

అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 600 కిలోలకు పైగా బరువున్న దీనిని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 2020 నుంచే తయారు చేయడం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతుండడంతో తమిళనాడు నుంచి అయోధ్యకు తరలించారు.


గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. దీనిని ప్రస్తుతం ఆయోధ్య రామమందిర ప్రాంగణంలో భక్తుల సందర్శనార్ధం ఉంచారు. ఇక జనవరిలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రస్తుతం రామ్‌లల్లా విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. కాశీ పండితులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 28 , 2023 | 05:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising