ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rapido Driver: బెంగళూరులో దారుణం.. మహిళను వేధించిన ర్యాపిడో డ్రైవర్

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:14 PM

ఓ ర్యాపిడో డ్రైవర్ తన బైక్ ఎక్కిన మహిళా ప్యాసింజర్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో జరిగింది.

బెంగళూరు: ఓ ర్యాపిడో డ్రైవర్ తన బైక్ ఎక్కిన మహిళా ప్యాసింజర్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ శనివారం రాత్రి 8.30 గంటలకు టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్ బుక్ చేసింది. మహిళా ప్రయాణికురాలి దగ్గరికి చేరుకున్న డ్రైవర్ ఆమెను తన బైక్ పై ఎక్కించుకున్నాడు.

తన ఫోన్లో ఛార్జింగ్ లేదని చెబుతూ.. లోకేషన్ చేరుకోవడానికి ప్రయాణికురాలి ఫోన్ కావాలని అడిగాడు. మహిళ అడిగిన వెంటనే మొబైల్ ఇచ్చింది. తరువాత ఆమె మాటలో మాట కలుపుతూ వ్యక్తిగత విషయాలు అడగటం ప్రారంభించాడు. ఇదివరకు ఎన్నో సార్లు ర్యాపిడో బుక్ చేసిన అనుభవంతో డ్రైవర్ కి విషయాలు చెప్పేసింది ఆ మహిళ. తరువాత పెట్రోల్ కొట్టించడానికి బైక్ ని ఆపారు.

పెట్రోల్ తాళం తీస్తున్న నెపంతో ఆమె రహస్య భాగాలను తాకాడు. తరువాత రెండు మూడు సార్లు ఇలాగే చేయడంతో బాధితురాలు చాలా భయపడింది. ఫోన్ కూడా డ్రైవర్ దగ్గర ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది. డ్రైవర్ ప్రవర్తనతో లోలోపల కుంగిపోతు, బాధపడుతూ చివరికి గమ్యానికి చేరుకుంది. బండి ఆపినా కొట్టే ధైర్యం లేకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్లో డ్రైవర్ పై ఫిర్యాదు చేసింది. ర్యాపిడో మేనేజ్ మెంట్ కి సైతం కంప్లెంట్ చేయడంతో అతనిపై చర్యలు తీసుకుంటామని కంపెనీ అధికారులు తెలిపారు.

"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 18 , 2023 | 02:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising