ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: మూడు రాష్ట్రాల్లో మంత్రి వర్గ విస్తరణపై బీజేపీ కసరత్తు.. నడ్డా నివాసంలో కీలక భేటీ

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:03 AM

ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అధికారపగ్గాలు చేపట్టింది బీజేపీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లకు ముఖ్యమంత్రులను ప్రకటించిన తరువాత తాజాగా ఆయా రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించింది.

ఢిల్లీ: ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అధికారపగ్గాలు చేపట్టింది బీజేపీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లకు ముఖ్యమంత్రులను ప్రకటించిన తరువాత తాజాగా ఆయా రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించింది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో బీజేపీ(BJP) ఈ అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఆదివారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నివాసంలో మంత్రివర్గ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలోని నేతలందరికీ సమన్యాయం జరిగేలా మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.


ఇందులో సోషల్ ఇంజినీరింగ్ కి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు వాటిని అమలు చేసే విధానాలపై నేతలు చర్చించారు. రాజస్థాన్ కి చెందిన తొలి సమావేశాన్ని సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించారు.

సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సీఎం భజన్ లాల్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్ కేబినెట్ ఏర్పాటుపై రెండో సమావేశం జరిగింది. దీనికి సీఎం విష్ణుదేవ్, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సాహూ, విజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 69 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 18 , 2023 | 11:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising