ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ballari City MLA: గాలి సోమశేఖర్‌ రెడ్డి కదలికలపై ఏరేంజ్‌లో నిఘా ఉందంటే..

ABN, First Publish Date - 2023-02-28T08:12:57+05:30

బళ్లారి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి (Ballari City MLA Gali Somasekhar Reddy) రాజకీయంగా వేసే ప్రతి అడుగుపైనా రాష్ట్ర కమలనాథులు నిఘా పెడుతున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బళ్లారి (ఆంధ్రజ్యోతి): బళ్లారి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి (Ballari City MLA Gali Somasekhar Reddy) రాజకీయంగా వేసే ప్రతి అడుగుపైనా రాష్ట్ర కమలనాథులు నిఘా పెడుతున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా బళ్లారిలో రాజకీయ పరిస్థితి, ప్రస్తుతం బీజేపీలో ఉండి గట్టిగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు ఎవరు..? పార్టీ ప్రతిష్టకు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నదెవరు అనే అంశాలను బీజేపీ అధిష్టానం (BJP High Command) ప్రత్యేక సమాచారాన్ని తెప్పించుకున్నట్లు ఆ పార్టీలోని ఓ కీలక నేత ద్వారా సమాచారం తెలిసింది.

అమిత్‌ షా (Amit Shah) బళ్లారి జిల్లా పర్యటన సందర్భంగా బళ్లారి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆయన కదలికలు, పార్టీపై పట్టు తదితర అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. ప్రధానంగా గాలి సోమశేఖర్‌రెడ్డి బీజేపీలోని (Gali Somasekhar Reddy BJP) తన అనుచరులనే ఎక్కువ మందిని ఆయన తమ్ముడు గాలి జనార్దన్‌రెడ్డి (Gali Janardhana Reddy) స్థాపించిన కేఆర్‌పీపీలోకి (KRPP) పంపిస్తున్నారని, ఆయన తెరవెనుక ఒకరకంగా, తెరముందు మరోలా వ్యవహరిస్తున్నారని నిఘా వర్గాలు పార్టీకి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇందుకు కొన్ని ఉదాహరణలు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా గాలి సోమశేఖర్‌రెడ్డి కాకుండా బళ్లారి నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా మరేవరైనా కొత్త వాళ్లు ఉన్నారా..? పార్టీలో ఉండి కష్టపడిన వారితో పాటు ఇతర పార్టీల్లో కీలకంగా ఉండి అక్కడ అసంతృప్తితో ఉంటే పార్టీ టికెట్‌ ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

బళ్లారి నగరంలో (Ballari City) పలు వర్గాలపై బీజేపీ అధిష్టానం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు బుడా అధ్యక్షుడిగా పనిచేసిన పి. పాలన్న, ప్రస్తుత బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్‌, బెస్టు స్కూల్‌ రామప్ప, లింగాయత్‌ వర్గానికి చెందిన ఒక జర్నలిస్టు, ఓ న్యాయవాది ఇలా అనేక రకాలుగా అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు ఒకరిద్దరు మహిళల పేర్లు తెరముందుకు వచ్చాయని సమాచారం. నగరంలో గాలి అరుణ (Gali Aruna) కేఆర్‌పీపీ నుంచి పోటీ చేస్తే బీజేపీ కూడా మహిళను రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది అనే అంశం తెరపైకి తెచ్చిందని సమాచారం.

డాక్టర్‌ కామూర్తి అరుణ పేరును కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అంతే కాకుండా యువకులు, సంపన్నులు, స్థానికంగా ఉండే బలమైన నాయకుల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే గాలి సోమశేఖర్‌రెడ్డి మాత్రం తాను పార్టీలోనే ఉంటానని, పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదంటూ కార్యకర్తలతో చెప్పుకుంటున్నారు. మొత్తంగా గాలి జనార్దన్‌రెడ్డి ప్రభావంతో బళ్లారిపై బీజేపీ అధినాయకులు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2023-02-28T08:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!