ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan CM race: 'నారీ శక్తి' కే సీఎం పీఠం.. రేసులో ఈ 9 మంది

ABN, First Publish Date - 2023-12-12T14:49:06+05:30

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ ఈసారి "నారీ శక్తి''కే పెద్దపీట వేసే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. రేసులో తొమ్మిది మంది మహిళా సీఎం అభ్యర్థులు ఉన్నారు.

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ ఈసారి "నారీ శక్తి''కే పెద్దపీట వేసే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. అయితే మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశానంతరం ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. బీజేపీ కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఈ సమావేశం జరుగనున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లా శర్మ తెలిపారు. కేంద్ర పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సరోజ్ పాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద తవడే ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు 115 సీట్లు బీజేపీ గెలుచుకుంది.


సీఎం రేసులో ఉన్న మహిళా నేతలు

1.వసుంధరా రాజే సింధియా: రాజే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఝల్రాపటన్ నియోజకవర్గం నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌లాల్ చౌహాన్‌పై 53,193 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

2.దియా కుమారి: విద్యానగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభహ్యర్థి సీతారామ్ అగర్వాల్‌పై 71,368 ఓట్ల అధిక్యంతో దియా కుమారి గెలుపొందారు.

3.అనిత భదేల్: అజ్మీర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ద్రౌపది కోలిపై 4.446 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

4.సిద్ధి కుమారి: బికనెర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి యష్‌పాల్ గెహ్లాట్‌పై 19,303 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

5.డాక్టర్ మంజు బాఘ్‌మార్: జయల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మంజు దేవిపై 1,563 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

6.దీప్తి కిరణ్ మహాశ్వరి: రాజ్‌సమంద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ సింగ్ భాటిపై 31,962 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు

7.కల్పానా దేవి: లాడ్‌పుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నైముద్దీన్ గుడ్డూపై 25,522 ఓట్ల అధిక్యంతో గెలిచారు.

8.శోభా చౌహాన్: సోజత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నిరంజన్ ఆర్య చేతిలో 31,772 ఓట్ల తేడాతో గెలుపొందారు.

9.నౌక్షమ్ చౌదరి: కమాన్ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఎం.అహ్మద్‌పై 13,906 ఓట్ల అధిక్యంతో గెలిచారు.

Updated Date - 2023-12-12T14:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising