ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు బాంబు బెదిరింపులు

ABN, First Publish Date - 2023-01-23T02:43:51+05:30

ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులను జారీ చేసింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 22: ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులను జారీ చేసింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము ఆర్‌డీఎక్స్‌ బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించబోతున్నాం. ఎవరి ఇళ్లలో వారు ఉంటే సురక్షితంగా ఉంటారు. లేదంటే మీకే ప్రమాదం. ఆ రోజు ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేసిన వారికి రూ.4కోట్ల బహుమతి ఇస్తాం.’’ అంటూ ఆ సంస్థ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ సోషల్‌ మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చే శాడు. దీనిపై వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో 2009లో న్యాయవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ ఏర్పాటు చేసిన ఎస్‌ఎ్‌ఫజే సంస్థ పంజాబ్‌ను భారత్‌ నుంచి వేరు చేసి ప్రత్యేక దేశం (ఖలిస్థాన్‌)గా ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో మొదటిసారిగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన గరుడ ప్రత్యేక బలగాలు కర్తవ్య పథ్‌లో కవాతు నిర్వహించనున్నాయి.

Updated Date - 2023-01-23T02:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising