కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

British Home Minister : బ్రిటన్‌ హోంమంత్రి బ్రేవర్మన్‌పై వేటు

ABN, First Publish Date - 2023-11-14T04:10:22+05:30

బ్రిటన్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని రిషి సునాక్‌ ఆ దేశ హోంమంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్‌పై వేటు వేశారు. ఆమె స్థానంలో జేమ్స్‌ క్లెవర్లీని నియమించారు. అలాగే మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు విదేశాంగ శాఖ

 British Home Minister : బ్రిటన్‌ హోంమంత్రి బ్రేవర్మన్‌పై వేటు

లండన్‌, నవంబరు 13: బ్రిటన్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని రిషి సునాక్‌ ఆ దేశ హోంమంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్‌పై వేటు వేశారు. ఆమె స్థానంలో జేమ్స్‌ క్లెవర్లీని నియమించారు. అలాగే మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల క్రితం లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించకపోగా మెట్రోపాలిటన్‌ పోలీసులు అనుకూలంగా వ్యవహ రించారని విమర్శిస్తూ బ్రేవర్మన్‌ ‘ది టైమ్స్‌’కు రాసిన కథనం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ప్రధాని సునాక్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో క్లెవర్లీ చర్చలు జరిపేందుకు షెడ్యూల్‌ చేసిన రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రేవర్మన్‌ గతంలో వలసలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవిని పోగొట్టుకున్నారు. కాగా, మాజీ ప్రధాని కామెరూన్‌ (57) కొత్త విదేశాంగ మంత్రిగా తిరిగి ప్రభుత్వంలో చేరడం అసక్తికరంగా మారింది. మాజీ ప్రధాని, చట్టసభల్లో లేని నేతకు ఇలా మంత్రివర్గంలో స్థానం కల్పించడం బ్రిటన్‌ రాజకీయాల్లో అరుదు. అయితే త్వరలోనే ఆయనను ఎగువ సభకు నామినేట్‌ చేయనున్నట్టు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది. 2010-2016 మధ్యలో కామెరూన్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఉన్నారు. ‘‘నేను ఏడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆరేళ్లు ప్రధానిగా, పదకొండేళ్లు కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా పనిచేసిన అనుభవం ప్రధానికి సహాయం చేయడంలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’’ అని కామెరూన్‌ అన్నారు.

Updated Date - 2023-11-14T04:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising