ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Britain and India : విజయ్ మాల్యా, నీరవ్ మోదీలపై బ్రిటన్ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-13T14:45:41+05:30

బ్రిటన్ అంటే, చట్టం నుంచి తప్పించుకుని, దాక్కోవడానికి అనువైనచోటు కాదని ఆ దేశ భద్రతా శాఖ మంత్రి టామ్ టుగెంధట్ చెప్పారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని తమ దేశం నుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారత్, బ్రిటన్ దేశాలకు నిర్దిష్ట న్యాయ ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు.

Vijay Mallya , Nirav Modi

న్యూఢిల్లీ : బ్రిటన్ అంటే, చట్టం నుంచి తప్పించుకుని, దాక్కోవడానికి అనువైనచోటు కాదని ఆ దేశ భద్రతా శాఖ మంత్రి టామ్ టుగెంధట్ చెప్పారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని తమ దేశం నుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారత్, బ్రిటన్ దేశాలకు నిర్దిష్ట న్యాయ ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు. బ్యాంకు రుణాల ఎగవేతదారులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్న సంగతి తెలిసిందే.

టామ్ టుగెంధట్ కోల్‌కతాలో జరిగిన జీ20 యాంటీ కరప్షన్ మినిస్టీరియల్ సమావేశంలో పాల్గొనడం కోసం వచ్చారు. ఆయన ఈ నెల 10 నుంచి 12 వరకు మన దేశంలో పర్యటించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో చర్చలు జరిపారు.

టామ్ టుగెంధట్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అనేక మంది ఆర్థిక నేరగాళ్లు బ్రిటన్‌లో ఉన్నారని, వారిని భారత దేశానికి పంపించాలని భారత ప్రభుత్వం కోరుతోందని, దీనిపై మీ స్పందన ఏమిటని అడిగారు.

దీనిపై టామ్ స్పందిస్తూ, చట్టం నుంచి తప్పించుకుని దాక్కోవడానికి అనువైన చోటుగా ఉండాలనే ఉద్దేశం బ్రిటన్‌కు లేదన్నారు. భారత్, బ్రిటన్‌లకు నిర్దిష్టమైన న్యాయ ప్రక్రియలు ఉన్నాయని, వాటిని పాటించడం తప్పనిసరి అని చెప్పారు.

విజయ్ మాల్యా దాదాపు రూ.9,000 కోట్లు బ్యాంకు రుణాలను ఎగవేసి, 2016లో బ్రిటన్ పారిపోయారు. అదేవిధంగా నీరవ్ మోదీ దాదాపు 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, ఆయన కూడా బ్రిటన్‌లోనే తలదాచుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి :

Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

Updated Date - 2023-08-13T14:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising