ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Operation Alert: ఇండో-పాక్ సరిహద్దుల వెంబడి బీఎస్‌ఎఫ్ 'ఆపరేషన్ అలర్ట్'

ABN, First Publish Date - 2023-01-22T19:55:44+05:30

భారత గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: భారత గణతంత్ర దినోత్సవాలను (Republic Day Celebrations) దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ (BSF) ఏడు రోజుల 'ఆపరేషన్ అలర్ట్'‌ (Operation Alert)ను ప్రారంభించింది. గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్ అలర్ట్‌లో పాల్గొంటున్నారు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచారు. శనివారంనాడు ప్రారంభమైన ఈ 'ఆపరేషన్ అలర్ట్' ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా సంఘ వ్యతిరేక శక్తుల దుశ్చర్యలు తిప్పికొట్టేందుకు 'ఈపరేషన్ అలర్ట్' నిర్వహిస్తున్నట్టు బీఎస్ఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ ఒక ప్రకటనలో తెలిపారు.

గుజరాత్‌లోని కచ్ వెంబడి ఇండో-పాక్ సరిహద్దును అత్యంత సున్నితమైన ప్రాతంగా భావిస్తుంటారు. చేపల వేట కోసం బోట్లపై భారత జలాల్లోకి పాక్ జాతీయులు అనేకమార్లు అడుగుపెట్టడం, పట్టుబడటం వంటివి జరిగాయి. ఒక్క 2022లోనే గుజరాత్ ప్రాంతంలో 22 మంది పాక్ మత్స్యకారులను పట్టుకుని, 79 పడవలను, రూ.250 కోట్లు విలువచేసే హెరాయిన్, రూ.2.49 విలువచేసే మాదకద్రవ్యాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

కాగా, సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచడంలో భాగంగా వ్యూహాత్మకమైన సర్ క్రీక్, హరామీ నాలా ఏరియాలో 'పెర్మనెంట్ వర్టికల్ బంకర్స్' నిర్మాణం జరగుతున్నట్టు బీఎస్ఎఫ్ వర్గాలు గతంలో తెలిపాయి. బుజ్ సెక్టార్ వెంబడి 8 మల్టీ-స్టోరీ బంకర్లు-అబ్జర్వేషన్ పోస్టుల నిర్మాణానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.50 కోట్ల మేరకు నిధులు కూడా మంజూరు చేసింది. పాకిస్థాన్ మత్స్యకారులు, పడవల చొరబాటు నిరంతరాయంగా సాగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా, చర్యల కోసం హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-01-22T20:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising