Bus Overturns: నేపాల్ నుంచి యాత్రికులతో వస్తూ బోల్తాపడిన బస్సు.. 60 మందికి గాయాలు
ABN, First Publish Date - 2023-01-21T19:49:05+05:30
భారత యాత్రికులతో నేపాల్(Nepal) నుంచి వస్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో 60 మంది గాయపడ్డారు
న్యూఢిల్లీ: భారత యాత్రికులతో నేపాల్(Nepal) నుంచి వస్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో 60 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది యాత్రికులు ఉన్నారు. బాధితులు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్ జిల్లా పిపీగంజ్, కంపిర్గంజ్కు చెందిన వారు. నేపాల్‌లోని త్రివేణి ధామ్ (Triveni Dham) నుంచి వస్తుండగా ఓ లోయ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఇండియా-నేపాల్ సరిహద్దులోని తుథిబారీ బోర్డర్‌కు 500 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ పోలీసులు క్షతగాత్రులను నవాల్ పరాసి జిల్లాలోని పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన యూపీలోని మహారాజ్‌గంజ్ కలెక్టర్ నేపాల్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Updated Date - 2023-01-21T19:49:06+05:30 IST