ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

ABN, First Publish Date - 2023-07-10T02:15:59+05:30

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ వారమే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ వారమే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అతి త్వరలోనే పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 13-14 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నందున.. ఆలోపే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచ నా వేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కసరత్తు పూర్తయిందని, అందుకు అనుగుణంగానే పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారని ఆవర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం గవర్నర్లు, ముఖ్యమంత్రుల మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని కూడా భావిస్తున్నారు. అయితే ఏ కారణం వల్లనైనా వచ్చే వారం మార్పులు లేకపోతే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తర్వాత ఆగస్టులోనే చేయాల్సి ఉం టుందని పేర్కొంటున్నారు.

కానీ, ప్రధాని సాధ్యమైనంత త్వరలో ‘ఎన్నికల క్యాబినెట్‌’ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం కిరణ్‌ రిజిజును న్యాయ శాఖ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 4 రోజుల క్రితం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, భూపేంద్రయాదవ్‌, గజేంద్రసింగ్‌ షెఖావత్‌, ఎస్పీఎస్‌ బఘేల్‌, ప్రహ్లాద్‌ జోషితదితరులు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతో్‌షలను కలుసుకోవడంతో మంత్రివర్గ మార్పులపై ఊహగానాలు ముమ్మరమయ్యాయి. ఆ తర్వాత ప్రహ్లాద్‌ జోషి, భూపేంద్ర యాదవ్‌లకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 2021 జూలై7 తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అప్పు డు ప్రకాశ్‌ జావడేకర్‌, రవిశంకర్‌ప్రసాద్‌ సహా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి 36మంది కొత్తవారికి స్థానం కల్పించారు. ఈసారి మా ర్పులు భారీగా లేకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయంటున్నారు.

Updated Date - 2023-07-10T02:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising