ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..

ABN, First Publish Date - 2023-07-06T10:01:10+05:30

కెనడా (Canada) రాజకీయ పార్టీల నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి భారత ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ, ఖలిస్థానీలు పాల్పడుతున్న హింసాకాండ గురించి కెనడా నేతలు నోరు మెదపడం లేదు. మరోవైపు సిక్కు వేర్పాటువాదులు రాడికలైజ్ అవడం పెరుగుతోందని కెనడియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కెనడా (Canada) రాజకీయ పార్టీల నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి భారత ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ, ఖలిస్థానీలు పాల్పడుతున్న హింసాకాండ గురించి కెనడా నేతలు నోరు మెదపడం లేదు. మరోవైపు సిక్కు వేర్పాటువాదులు రాడికలైజ్ అవడం పెరుగుతోందని కెనడియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు భద్రత కల్పించారు.

కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల పేర్లు, ఫొటోలను ప్రదర్శిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాదులు బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై కెనడా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి నామమాత్రంగా మాత్రమే స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కానీ ప్రతిపక్ష కన్జర్వేటివ్ లీడర్ లేదా ప్రధాన మంత్రి ఈ దాడులను ఖండించలేదు. భారతీయ మూలాలుగలవారు కెనడాలో దాదాపు 24 లక్షల మంది ఉన్నారు. అయితే ఏడు లక్షల మంది ఉన్న సిక్కులు ఓటు బ్యాంకుగా మారారు. గ్రేటర్ టొరంటో, గ్రేటర్ వాంకోవర్, ఎడ్మంటన్, కల్గరీలలో వీరి ఓట్లకు చాలా ప్రాధాన్యం ఉంది. భారతీయ మూలాలుగలవారు ఐకమత్యంగా లేకుండా, విడిపోయారు. మితవాద సిక్కులు అతివాద సిక్కుల గురించి కనీసం ఒక మాట అయినా మాట్లాడరు. భారతీయ మూలాలుగలవారు కూడా ఏమీ మాట్లాడరు.

టొరంటో, వాంకోవర్ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు ప్రకటించడంతో కెనడా పోలీసులు, నిఘా అధికారులు ఇండియన్ హై కమిషన్, కాన్సులేట్ల అధికారులతో మాట్లాడుతున్నారు. ఉన్నత స్థాయి దౌత్యవేత్తలకు భద్రత కల్పించారు.

సిక్కు ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను జూన్ 19న వాంకోవర్‌లో ఆయన ప్రత్యర్థి వర్గం హత్య చేసింది. ఈ హత్యకు నిరసనగా ఇండియన్ కాన్సులేట్ల వద్ద ఈ నెల 8న ప్రదర్శనలు నిర్వహిస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) ప్రకటించింది. ఈ సంస్థ చీఫ్ గురు పత్వంత్ సింగ్‌కు అమెరికా, కెనడా డ్యూయల్ పాస్‌పోర్టు ఉంది. గ్రేటర్ టొరంటోలో జూలై 16న రిఫరెండం నిర్వహించాలని ఈ సంస్థ ప్రణాళిక రచిస్తోంది. గ్రేటర్ వాంకోవర్‌లో కూడా సెప్టెంబరులో రిఫరెండం నిర్వహించాలని ప్రయత్నిస్తోంది.

వాంకోవర్‌లో నిజ్జర్, బ్రిటన్‌లో అవతార్ సింగ్ ఖండా గ్యాంగ్ వార్స్‌లో హత్యకు గురైన తర్వాత గురు పత్వంత్ సింగ్ పన్ను బాహాటంగా బయట కనిపించడం లేదు. జూలై 8న జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. సిక్కు ఖలిస్థానీ ఉగ్రవాదులకు పాకిస్థాన్ తెర వెనుక మద్దతు ఉంది.

ఇవి కూడా చదవండి

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Tomato: గణనీయంగా తగ్గిన టమోటాల విక్రయం

Updated Date - 2023-07-06T10:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising