Kerala Blast:కేరళ పేలుళ్లను కవర్ చేసిన జర్నలిస్టుపై కేసు.. ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-11-03T09:07:55+05:30
కేరళలోని ఎర్నాకులం(Ernakulam) జిల్లా కాలామస్సేరి(Kalamessery) నెస్ట్ సమీపంలోని యెహోవా ప్రార్థనా మందిరంలో అక్టోబర్ 29న ఉదయం 9.30కు టిఫిన్ బాక్స్ లో అమర్చిన ఐఈడీ(IED Bombs) బాంబులు ఒక్కసారిగా పేలిన ఘటన విదితమే. పేలుళ్ల ఘటన వివరాలను కవర్ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై(Journalist) ముస్లిం వ్యక్తి కేసు నమోదు చేశారు.
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకులం(Ernakulam) జిల్లా కాలామస్సేరి(Kalamessery) నెస్ట్ సమీపంలోని యెహోవా ప్రార్థనా మందిరంలో అక్టోబర్ 29న ఉదయం 9.30కు టిఫిన్ బాక్స్ లో అమర్చిన ఐఈడీ(IED Bombs) బాంబులు ఒక్కసారిగా పేలిన ఘటన విదితమే. పేలుళ్ల ఘటన వివరాలను కవర్ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై(Journalist) ముస్లిం వ్యక్తి కేసు నమోదు చేశారు. పేలుళ్ల అనంతరం.. ఓ టీవీ ఛానల్ కోఎడిటర్ సుజయ పార్వతి ఘటనా స్థలంలో న్యూస్ కవరేజీకి వెళ్లింది. పేలుడుకు ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil- Palestine) వివాదంతో ముడిపెట్టేందుకు జర్నలిస్ట్ ప్రయత్నించారని, తద్వారా ముస్లిం సమాజం పరువుకు భంగం వాటిల్లిందని కాలమెస్సేరి నివాసి యాసిన్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు మలయాళ టీవీ ఛానల్, దాని స్టాఫ్ జర్నలిస్టుపై కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన టీవీ యాజమాన్యం కేసుపై న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేసింది. “ఈ కంప్లైంట్ వెనుక సంకుచిత ప్రయోజనాలున్నాయి. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే కొందరు ప్రయత్నిస్తున్నారు ”అని రిపోర్టర్ అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని ఉగ్రవాద నిరోధక చట్టం కింద పోలీసులు 4 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. తానే ఈ కన్వెన్షన్ సెంటర్‌లో బాంబులు పెట్టానని ప్రకటిస్తూ.. పోలీసుల ముందు మార్టిన్ లొంగిపోయిన ఒక రోజు తర్వాత అతడ్ని అరెస్ట్ చేశారు. తాను లొంగిపోవడానికి ముందు.. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘యెహోవా విట్‌నెసెస్’ అనే క్రిస్టియన్ సమూహం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబులు ఎందుకు పెట్టానో ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తానూ కొన్ని సంవత్సరాల నుంచి యెహోవా విట్‌నెసెస్ గ్రూపులో ఉన్నానని, అయితే వారి బోధనలు విద్రోహపూరితంగా ఉన్నాయని తెలిపాడు. తమ తీరు మార్చుకోవాలని వాళ్లను ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఈ పేలుళ్లకు పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఆ సంస్థ భావజాలం దేశానికి అత్యంత ప్రమాదకరమైనదని, వాళ్లు ఎవరికీ సహాయం చేయరు, ఎవరినీ గౌరవించరని చెప్పాడు. నిమిషాల వ్యవధిలో ఆ కన్వెన్షన్‌లో మూడు పేలుళ్లు సంభవించగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3కి చేరింది. తొలుత ఈ పేలుళ్లు సంభవించినప్పుడు ఘటనా స్థలంలో ఒకరు మరణించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఆరుగురిలో 53 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అలాగే.. సోమవారం ఉదయం 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన 12 ఏళ్ల బాలిక సైతం మృతి చెందింది. ఈ ఘటనలో గాయాపాలైన 45 మంది చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2023-11-03T09:10:44+05:30 IST