ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kejriwal: కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

ABN, First Publish Date - 2023-04-15T02:38:53+05:30

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఆప్‌ నేత సిసోడియా, విజయ్‌ నాయర్‌ సహా పలువురు జైల్లో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్‌ జాతీయ హోదా కల్పించిన అనంతరం ఇక పార్టీ నేతలంతా జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని కేజ్రీవాల్‌ పేర్కొనడం గమనార్హం. ఆయన అలా వ్యాఖ్యానించిన రెండ్రోజులకే మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

దేశంలో అభివృద్ధిని వ్యతిరేకించే పలు జాతి వ్యతిరేక శక్తులే సిసోడియాను జైలుకు పంపించారని, వారు దేశ వ్యతిరేకులని కేజ్రీవాల్‌ శుక్రవారం విమర్శించారు. దళితులు, అణగారిన వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్‌ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. సీబీఐ సమన్లు పంపినంత మాత్రాన అవినీతిపై కేజ్రీవాల్‌ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు వైభవ్‌ కుమార్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో వైభవ్‌, సిసోడియా, ఇతరులు 170 ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

Updated Date - 2023-04-15T02:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising