ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Central Cabinet Changes: భారీ ప్రక్షాళన!

ABN, First Publish Date - 2023-07-01T02:37:42+05:30

కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన సహా పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఆమెకు తమిళనాడులో... మిగతా మంత్రులకు వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారా? ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుధవారమే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

నిర్మల సహా పలువురు మంత్రులను తప్పించే అవకాశం

ప్రభుత్వం నుంచి తప్పించి పార్టీ బాధ్యతల అప్పగింత

రాష్ట్రంలో పార్టీ పగ్గాల స్వీకరణకు కిషన్‌రెడ్డి విముఖత

ఆయన్ను మారిస్తే లక్ష్మణ్‌కు క్యాబినెట్‌లో చోటిచ్చేచాన్స

రఘురామరాజు సహా మరికొందరు నేతలు బీజేపీలోకి!

న్యూఢిల్లీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన సహా పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఆమెకు తమిళనాడులో... మిగతా మంత్రులకు వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారా? అలా జరిగే అవకాశాలు లేకపోలేదని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం జరిగే కేంద్ర మంత్రిమండలి విస్తృతస్థాయి సమావేశం తర్వాత క్యాబినెట్‌లో భారీ మార్పులు ఉంటాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ భేటీ ముగియగానే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని.. వారిలో పలువురికి అదే రోజు ఆయా రాషా్ట్రల్లో బాధ్యతలు అప్పగిస్తారని, పలు రాషా్ట్రల బీజేపీ అధ్యక్షులను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ బుధవారం ఉదయం ఉంటుందని ఆ వర్గాలుపేర్కొంటున్నాయి. వారు చెబుతున్నదాని ప్రకారం.. ఆర్థిక శాఖ నుంచి నిర్మలను తప్పించి, ఆమె స్థానంలో జనాకర్షక, ప్రజా సంక్షేమ విధానాలను రూపొందించేవారిని నియమించాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే.. విద్యా మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒడిశా బాధ్యతలు, వ్యవసాయమంత్రి నరేంద్రతోమర్‌కు మధ్యప్రదేశ్‌ బాధ్యతలు.. బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న ప్రహ్లాద్‌ జోషికి కర్ణాటక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌కు రాజస్థాన్‌లో ఎన్నికల బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదం నేపథ్యంలో.. అశ్వినీ వైష్ణవ్‌ను రైల్వే శాఖ నుంచి తప్పించి ఐటీ, కమ్యూనికేషన్లకు పరిమితం చేయవచ్చనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో..

తెలంగాణలో బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నప్పటికీ.. తాను మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టలేనని ఆయన అమిత్‌ షాకు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. తెలంగాణలో పార్టీ బాఽధ్యతలు ఎవరికి అప్పగిస్తారు, సంజయ్‌నేకొనసాగిస్తారా, లేక కిషన్‌ రెడ్డికి అధిష్ఠానం నచ్చజెబుతుందా అనేది 1-2 రోజుల్లో తేలిపోనుంది. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులపై నిర్ణయాలు జరిగాయని, తెలంగాణపై కూడా ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కిషన్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన పక్షంలో.. సీనియర్‌ నేత లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి.

ఈనేపథ్యంలోనే.. శనివారం జరిగే రాషా్ట్రల మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న లక్ష్మణ్‌ను మరో 2-3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందిగా పార్టీ నేతలు ఆదేశించినట్లు తెలిసింది. అలాగే, ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార కమిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ సారథ్యం అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్‌ యాదవ్‌ను బీజేపీ అఽధ్యక్షుడుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని పార్టీ వర్గాలు తెలిపాయి. సత్యకుమార్‌ యాదవ్‌ అధ్యక్షుడైన వెంటనే ఏపీలో పార్టీకి భారీ ఊపు తెచ్చేందుకు కార్యక్రమాలు చేపడతారని.. వైసీపీ ఎంపీ రఘురామరాజుతో పాటు పలువురు ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటారని చర్చ జరుగుతోంది. అంతేకాక సత్యకుమార్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడైతే తెలుగుదేశం-జనసేనతో ఎన్నికల పొత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-07-01T02:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising