Aadhaar నుంచి ఇంపార్టెంట్ అలెర్ట్.. మీరు ఆధార్ కార్డును తీసుకుని పదేళ్లు దాటిందా..? అయితే అస్సలు ఆలస్యం చేయకుండా..
ABN, First Publish Date - 2023-02-20T17:44:54+05:30
ఇంపార్టెంట్ అలర్టె్. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారు వెంటనే తమ వివరాలను ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డ్(Aadhar Card) ప్రస్తుతం ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్ కార్డుల జారీ 2010లో ప్రారంభమైంది. దీంతో.. పదేళ్ల క్రితమే అనేక మంది ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వం.. వ్యక్తుల బయోమెట్రిక్ వివరాలను కూడా ఆధార్‌కు జత చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో సూచన చేసింది. ఆధార్డ్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారందరూ ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పదేళ్లల్లో ఆధార్ వివరాలను ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని వారు వెంటనే స్పందించాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఆధార్ కార్డు ఆన్‌లైన్‌లో మరోసారి ధ్రువీకరించుకునేందుకు గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ కావాలి. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి ఆధార్ రీవెరిఫై(Reverification) చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు రూ.25, ఆఫ్‌లైన్ ఫీజును రూ.50గా ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేకాకుండా..మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లతో ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుందని చెప్పింది.
ఇక పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డు అనుసంధానం(Pan-Aadhar Link) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 డెడ్ లైన్ విధించింది. ఆలోపు పాన్‌ను ఆధార్‌లో లింక్ చేయకపోతే..పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుందని కూడా హెచ్చరించింది.
Updated Date - 2023-02-20T17:52:35+05:30 IST