ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agniveers: అగ్నివీరులకు బీఎస్ఎఫ్‌లో 10 శాతం రిజర్వేషన్

ABN, First Publish Date - 2023-03-10T14:51:30+05:30

అగ్నివీరులకు కేంద్ర శుభవార్త చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయ్యేవారికి బీఎస్‌ఎఫ్ నియామాకాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: అగ్నివీరులకు (Agniveers) కేంద్ర శుభవార్త చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయ్యేవారికి బీఎస్‌ఎఫ్ (BSF) నియామాకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళంలో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. వీరు అగ్నిపథ్ మొదటి బ్యాచ్‌లో పనిచేశారా లేదా తదుపరి బ్యాచ్‌లకు చెందిన వారా అనే దాని ఆధారంగా గరిష్ట వయోపరిమితి నిబంధనలను కూడా సడలించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డ్యూటీ కేడర్-2015కు సంబంధించిన నిబంధనలను కేంద్ర సవరించింది. అగ్నివీర్ మొదటి బ్యాచ్‌లో చేరి విశ్రాంతి తీసుకునే సైనికులకు 5 సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌లలో చేరి రిటైర్ అయిన అభ్యర్థులకు 3 సంవత్సవారల వరకూ గరిష్ట వయోపరిమితిని సడలించనున్నారు. మజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్ నియామక ప్రక్రియలో దేహడారుఢ్య పరీక్షల నుంచి సైతం మినహాయింపు కల్పించనున్నారు.

కాగా, నాలుగేళ్ల పాటు దేశ సైనికులుగా సేవలందించిన అగ్నివీరులకు సీఏఎస్ఎఫ్, అసోం రైఫిల్స్‌తో పాటు బీఎస్ఎఫ్ నియామకాల్లో వయోపరిమితిని 3, 5 సంవత్సరాలకు పెంచడం, దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పించడం వల్ల ఉద్యోగార్ధులకు కొంత మేరకు మరింత లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం తొలి బ్యాచ్‌లోని అభ్యర్థులు 28 సంవత్సరాల వరకూ అగ్నివీర్‌గా సేవలందించి, ఆపై కేంద్ర భద్రతా దళాలు, అసోం రైఫిల్స్‌లో చేరేందుకు 10 శాతం రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తుంది.

తొలినాళ్లలో నిరసనలు..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌పై మొదట్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. అగ్నిపథ్ స్కీమ్ కింద 25 శాతం మంది సైనికులను కొనసాగించేలా కేంద్రం ఈ పథకం తెచ్చింది. అనంతరం కేంద్ర సవరణలు చేపట్టింది. నాలుగు సంవత్సరాలు సేవలందించిన తక్కిన 75 శాతం మంది సైనికులకు కేంద్ర పారామిలటరీ, అసోం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. వీటి నియామకాల్లో గరిష్ట వయోపరిమితి పెంచింది. ఫిజికల్ టెస్టుల నుంచి కూడా మినహాయింపు వచ్చింది. తాజాగా, బీఎస్ఎఫ్‌లోనూ 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో అగ్నివీరులకు మరింత ఉపశమనం కలుగనుంది.

Updated Date - 2023-03-10T14:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising