Census : స్వాత్రంత్యానంతరం కులాలవారీ జనగణన జరగలేదు : కేంద్రం
ABN, First Publish Date - 2023-07-25T14:32:02+05:30
కులాలవారీ జనాభా లెక్కలను సేకరించాలని కొందరు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు ఓ విషయాన్ని చెప్పింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు మినహా మిగిలిన కులాల జనాభాను కులాలవారీగా సేకరించలేదని తెలిపింది.
న్యూఢిల్లీ : కులాలవారీ జనాభా లెక్కలను సేకరించాలని కొందరు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు ఓ విషయాన్ని చెప్పింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు మినహా మిగిలిన కులాల జనాభాను కులాలవారీగా సేకరించలేదని తెలిపింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ, జనాభా లెక్కలను సేకరించేటపుడు కులాలవారీగా సమాచారాన్ని సేకరించాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు కోరినట్లు తెలిపారు. ప్రత్యేకంగా నోటిఫై చేసిన కులాలు, తెగల వివరాలను మాత్రమే సేకరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ (షెడ్యూల్డు కులాల) ఆర్డర్, 1950, రాజ్యాంగ (షెడ్యూల్డు తెగల) ఆర్డర్, 1950ల ప్రకారమే ఎస్సీలు, ఎస్టీల వివరాలను మాత్రమే ప్రత్యేకంగా సేకరిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం కులాలవారీ జనాభా లెక్కలను సేకరించలేదన్నారు. కేవలం ఎస్సీలు, ఎస్టీల జనాభాను మాత్రమే సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఇటీవల కులాలవారీ జనాభా లెక్కలను సేకరించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రక్రియను పాట్నా హైకోర్టు నిలిపేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రభుత్వానికి ఊరట లభించలేదు.
ఇవి కూడా చదవండి :
CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం
Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..
Updated Date - 2023-07-25T14:32:02+05:30 IST