ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitish Kumar: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేసే ఉద్దేశం కేంద్రానికి లేదు..

ABN, First Publish Date - 2023-09-20T14:41:03+05:30

మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పాట్నా: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)ను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ''వాళ్లకు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసే ఉద్దేశం లేదు. వాళ్లకు ఆ ఉద్దేశం అంటూ ఉంటే గతంలోనే ఆ పని చేసేవారు'' అని బుధవారంనాడు మీడియాతో మాట్లాడూతూ నితీష్ అన్నారు.


మహిళలకు రిజర్వేషన్ కల్పించడం తప్పనిసరి అని, మొదట్నించీ తాము దీని కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నామని, అయినా వాళ్లు (కేంద్రం) ఈ బిల్లును అమలు చేయలేదని నితీష్ అన్నారు. కుల ఆధారణ జనగణన చేపట్టాలని తాము చాలాకాలంగా కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ ఇది తమ డిమాండ్‌గా ఉందని తెలిపారు. కాగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌పాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై బుధవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి చర్చ జరుగుతోంది. రాజ్యసభలో ఈనెల 21 బిల్లును ప్రవేశపెట్టనున్నారు.


వెంటనే అమలు చేయాలి: సోనియా

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పాల్గొంటూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బిల్లును అమల్లోకి తీసుకురావాలని, లేదంటే మహిళలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు రాజకీయ బాధ్యతలు చేపట్టాలని గత 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని, చట్టం సమర్ధ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలని సోనియాగాంధీ కోరారు.

Updated Date - 2023-09-20T14:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising