ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండర్‌‌ను గుర్తించిన నాసా ఉపగ్రహం.. ఎలా ఉందో చూడండి..

ABN, First Publish Date - 2023-09-06T17:28:49+05:30

ఇస్రో (ISRO) చంద్రయాన్-3లో జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌గా ల్యాండయిన ల్యాండర్ విక్రమ్ (Lander Vikram), దాదాపు 14 రోజులపాటు పరిశోధనలు చేపట్టిన ప్రజ్ఞాన్ రోవర్ (Rover Pragyan) ప్రస్తుతం చంద్రుడిపై చీకటి కావడంతో స్లీప్ మోడ్‌లో ఉన్నాయి. మళ్లీ సూర్యోదయం అయితేగానీ ఆ రెండూ యాక్టివ్ అవుతాయో లేదో క్లారిటీ వస్తుంది.

న్యూఢిల్లీ: ఇస్రో (ISRO) చంద్రయాన్-3లో జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌గా ల్యాండయిన ల్యాండర్ విక్రమ్ (Lander Vikram), దాదాపు 14 రోజులపాటు పరిశోధనలు చేపట్టిన ప్రజ్ఞాన్ రోవర్ (Rover Pragyan) ప్రస్తుతం చంద్రుడిపై చీకటి కావడంతో స్లీప్ మోడ్‌లో ఉన్నాయి. మళ్లీ సూర్యోదయం అయితేగానీ ఆ రెండూ యాక్టివ్ అవుతాయో లేదో క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఆసక్తికరమైన ఫొటో తీసింది.


నాసాకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ ‘ది లూనార్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్’ (LRO) చంద్రుడి దక్షిణధ్రువంపై ఉన్న ల్యాండర్ విక్రమ్‌ను గుర్తించి ఫొటో తీసింది. ఇటివలే తీసిన ఈ ఫొటోని ఎక్స్ (ట్విటర్) వేదికగా నాసా (NASA) షేర్ చేసింది. ‘‘ ఇస్రో చంద్రయాన్-3 (Chandrayaan-3) 23 ఆగస్టు 2023న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో దిగింది’’ అని ట్వీట్ ద్వారా పేర్కొంది.

నాసా ఎల్ఆర్ఐ కెమెరా (LRO camera) వాలు వీక్షణలో (42 డిగ్రీల స్లీవ్ యాంగిల్) ఈ ఫొటో తీసింది. ల్యాండర్ విక్రమ్ చుట్టూ ప్రకాశవంతంగా కనిపిస్తోందని పేర్కొంది. కాగా మేరీల్యాండ్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ నుంచి ఎల్ఆర్‌వోను నాసాకు చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నిర్వహిస్తుంటుంది.

Updated Date - 2023-09-06T17:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising