Chandrayaan-3: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3.. ఇస్రోకి దాసోహమైన వరల్డ్ రికార్డ్..
ABN, First Publish Date - 2023-08-25T18:08:02+05:30
చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3) భాగంగా విక్రమ్ ల్యాండర్‌ని (Vikram lander) సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని సమస్త భారతావని వేడుకలా జరుపుకుంది. ప్రపంచదేశాలు సైతం జయహో భారత్ అని కీర్తించాయి.
న్యూఢిల్లీ: చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3) భాగంగా విక్రమ్ ల్యాండర్‌ని (Vikram lander) సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని సమస్త భారతావని వేడుకలా జరుపుకుంది. ప్రపంచదేశాలు సైతం జయహో భారత్ అని కీర్తించాయి. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. టీవీల ముందు అతుక్కుపోయినవారు కొందరైతే.. యూట్యూబ్‌లో వీక్షించినవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఇస్రో యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డ్ సృష్టించింది.
గూగుల్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’లో చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రపంచ రికార్డ్ సృష్టించినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన లైవ్‌స్ట్రీమ్‌గా నిలిచిందని తెలుస్తోంది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను ఇస్రో అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో ఏకంగా 8 మిలియన్ల (80 లక్షల) మంది వీక్షించారు. ఒక ఛానల్ లైవ్‌ని ఇంతమంది వీక్షించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
సాక్‌నిల్క్.కామ్ (sacnilk.com) రిపోర్ట్ ప్రకారం... చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో ఇస్రో యూట్యూబ్ ఛానల్ ప్రపంచ రికార్డ్ దక్కించుకుంది. అంతక్రితం 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ వర్సెస్ దక్షిణకొరియా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ 52,04,794 గా ఉండేది. ఆ రికార్డను ఇస్రో బ్రేక్ చేసిందని రిపోర్ట్ పేర్కొంది. గతేడాది మార్చి డిసెంబర్ 6న ఈ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-08-25T18:09:27+05:30 IST