ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్‌కు రెండు రోజుల ముందు ఆసక్తిగొలిపే ఫొటోలు పంపించిన చంద్రయాన్-3

ABN, First Publish Date - 2023-08-21T11:42:38+05:30

జాబిలిపై చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) సాఫ్ట్ ల్యాండింగ్ ఘట్టం కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక ఘట్టానికి ఆగస్టు 23 (బుధవారం) సాయంత్రం 6.05 గంటలకు ఇస్రో ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈ అద్భుత క్షణాలకు రెండు రోజుల ముందు చంద్రయాన్-3 ఆసక్తిగొలిపే కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

జాబిలిపై చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) సాఫ్ట్ ల్యాండింగ్ ఘట్టం కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక ఘట్టానికి ఆగస్టు 23 (బుధవారం) సాయంత్రం 6.05 గంటలకు ఇస్రో ముహూర్తం కూడా నిర్ణయించింది. అయితే ఈ అద్భుత క్షణాలకు రెండు రోజుల ముందు చంద్రయాన్-3 ఆసక్తిగొలిపే కొన్ని ఫొటోలను షేర్ చేసింది. భూమి వైపు నుంచి చంద్రుడి ఉపరితలంపై గుర్తించలేని కొన్ని బిలాలను (Craters) ఫొటోలు తీసి పంపించింది. ప్రముఖలైన ఈ ప్రాంతాలు చంద్రుడి అవతలి వైపు ఉంటాయి. కాబట్టి ఇవి సాధారణంగా కనిపించవు.


చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన, సురక్షిత ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా ఈ ఫొటోలను తీసింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఇస్రో పంచుకుంది. ‘‘ చంద్రుడి అవతలివైపు సుదూరంలో ల్యాండర్ హజార్డ్ డిటెన్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (LHDAC) బంధించిన చిత్రాలు ఇవి. సేఫ్ ల్యాండింగ్‌ కోసం పెద్దపెద్ద బండరాళ్లు లేదా లోతైన కందకాలు లేని ప్రాంతాన్ని గుర్తించడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఈ కెమెరాను ఎస్ఏసీ (Space application centre) వద్ద ఇస్రో అభివృద్ధి చేసింది’’ అని ఇస్రో పేర్కొంది.

Updated Date - 2023-08-21T11:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising