ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bharat : దేశం పేరు మార్పు మొదలైనది చంద్రయాన్-3కి ముందే!

ABN, First Publish Date - 2023-09-06T11:31:56+05:30

మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్ అని పిలిచే చర్యలు చంద్రయాన్-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు.

న్యూఢిల్లీ : మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్ అని పిలిచే చర్యలు చంద్రయాన్-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు. అయితే జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి భవన్ పంపించిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని కనిపించడంతో మంగళవారం మాత్రమే ఈ అంశం వెలుగులోకి వచ్చింది.

మోదీ గత నెల 22 నుంచి 25 వరకు దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించారు. జొహెన్నస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు. చంద్రయాన్-3 గత నెల 23న విజయవంతం అయింది.

ఇదిలావుండగా, జీ20 నేతల సమావేశంలో పాల్గొనే భారతీయ అధికారులకు జారీ చేసే గుర్తింపు కార్డుల్లో ‘ఇండియన్ అఫిషియల్’కు బదులుగా ‘భారత్ అఫిషియల్’ అని రాశారు.

మోదీ ఈ నెల 6, 7 తేదీల్లో ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఆసియన్ ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్లో కూడా ఆయనను ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గానే పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?

India : ‘ఇండియా’ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేనా?

Updated Date - 2023-09-06T11:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising