ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPCL: సముద్రంలోకి చమురు లీక్.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన జలచరాలు

ABN, Publish Date - Dec 14 , 2023 | 09:18 AM

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(CPCL) శుద్ధి కర్మాగారం నుంచి చమురు లీక్ అయి సముద్రంలో కలవడంతో వందల సంఖ్యలో జలచరాలు ప్రాణాలు కోల్పోయారు.

చెన్నై: చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(CPCL) శుద్ధి కర్మాగారం నుంచి చమురు లీక్ అయి సముద్రంలో కలవడంతో వందల సంఖ్యలో జలచరాలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కర్మాగారంలోని చమురు నిల్వలు వరద నీటితో నిండిపోయాయి. అవికాస్తా పొంగి పోర్లడంతో పక్కనే ఉన్న కోసస్తలైయార్ నదిలో అక్కడి నుంచి సముద్రంలో కలిసి పోయాయి.

దీంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. సముద్రంలో 20 కి.మీ.ల మేర ఎటు చూసిన చమురు తెట్టలు కనిపిస్తున్నాయి. హాట్ స్పాట్ లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సీపీసీఎల్ అధికారులను ఆదేశించింది. కంపెనీనుంచి ఆయిల్ ఎందుకు లీక్ అయిందో దర్యాప్తు చేయాలని కోరింది.

ఆస్తి నష్టం లేదా అనారోగ్యానికి గురైన వారికి పరిహారం అందించడానికి తాము కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. మైచాంగ్ తుపాను కారణంగా వచ్చిన వరదల్లో చమురుతో కూడిన కలుషితమైన నీరు చాలా మంది ఇళ్లలోకి ప్రవేశించాయి. ఈ నీటితో ప్రజలు శ్వాసకోశ సమస్యలు,చర్మంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్లతో బాధ పడ్డారు.

Updated Date - Dec 14 , 2023 | 09:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising