Chief Minister: వామ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. సీఎం హెలిప్యాడ్‌కు అతి సమీపంలోనే...
ABN, First Publish Date - 2023-04-14T14:06:32+05:30
సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) ప్రయాణించిన హెలికాప్టర్(Helicopter) ల్యాండ్ అయిన ప్రాంతం సమీపంలోనే
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) ప్రయాణించిన హెలికాప్టర్(Helicopter) ల్యాండ్ అయిన ప్రాంతం సమీపంలోనే మంటలు చెలరేగడంతో పోలీసులు బెంబేలెత్తారు. గురువారం ఉడుపి జిల్లా బైందూరుకు అనుబంధమైన అరేశిరూరు హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి ఎస్కార్ట్ వెళ్ళిపోయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ప్రభావం పెరగడంతో ఆందోళన కలిగించేలా మా రింది. వెంటనే పోలీసులు అప్రమ త్తం కాగా అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలు ఆర్పేశారు. సీఎం బయలుదేరాక మంటలు చెలరేగడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆరేశిరూరు హెలీప్యాడ్ నుంచి కొల్లూరుకు సీఎం వెళ్ళారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో జాబితా విడుదల కాగానే సీఎం బొమ్మై టెంపుల్ రన్ ప్రారంభించారు. కొల్లూరు మూకాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఇదే సమయానికి కాంతార ఫేం రిషబ్‌శెట్టి కూడా దర్శనానికి రావడంతో ఇద్దరూ కాసేపు పలకరించుకున్నారు. ఉడుపి జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి బొమ్మై వెళ్ళినా ఐదుగురు ఎమ్మెల్యేలు ఆయనకు దూరంగానే గడిపారు. సీఎం వెంట మంత్రి కోట శ్రీనివాస పూజారి, ప్రమోద్ మధ్వరాజ్‌లు ఉన్నారు.
Updated Date - 2023-04-14T14:06:32+05:30 IST