ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CISF: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు

ABN, First Publish Date - 2023-01-30T12:51:57+05:30

బెంగళూరు(Bengaluru)లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాద నియంత్రణ చర్యలకు మరింత పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పటిష్టమైన భద్రతే లక్ష్యం

బెంగళూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు(Bengaluru)లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాద నియంత్రణ చర్యలకు మరింత పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు చేయదలిచారు. ఇటీవలే ఆరంభమైన రెండో టర్మినల్‌కు సమగ్ర భద్రత కల్పించేందుకై 1700మంది సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) బలగాలను కేంద్రప్రభుత్వం కేటాయించినట్టు సమా చారం. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 3,500మంది విధులు నిర్వహిస్తున్నారు. అదనంగా 1700మందిని నియమించారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు టర్మినల్‌ 1, 2 లలోనూ పనిచేయనున్నారు. ప్రయాణీకులను పరిశీలించడం, కేబిన్‌లో లగేజీని స్కాన్‌ చేయడంతోపాటు సమగ్ర తనిఖీలు, యాంటి హైజాక్‌, ఉగ్రవాద దాడు ల నియంత్రణను పర్యవేక్షించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవం బరులో టర్మినల్‌-2ను ఆరంభించారు. ఇటీవలే ఇది అందుబాటులోకి వచ్చింది. రెండో టర్మినల్‌ను 5వేల కోట్లతో నిర్మించగా పూర్తిస్థాయిలో పర్యావరణ స్నేహిగా తీర్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు ఏటా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరి గాయి. దీంతో భద్రత మరింత పెంచే దిశగా అదనపు బలగాలను కేటాయించారు. ఇదే తరహాలోనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు 1400మందిని కేటాయించినట్టు సమాచారం.

Updated Date - 2023-01-30T12:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising