Cold Out Cough Syrup: అది జలుబు మందు కాదు, విషం.. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO వార్నింగ్
ABN, First Publish Date - 2023-08-08T18:42:39+05:30
ఒక మెడిసిన్‌ని తయారు చేసి మార్కెట్‌లో రిలీజ్ చేయాలంటే.. ఏదో అరటి తొక్క తీసేసి, పండు తిన్నంత ఈజీ కాదు. అది ఆరోగ్యానికి మంచిదేనా, కలుషితమైందా? ఫలానా జబ్బుని నయం చేయగలుగుతుంతా, లేదా? రసాయనాలన్నీ సముపాళ్లలోనే కలిపారా, లేదా?
ఒక మెడిసిన్‌ని తయారు చేసి మార్కెట్‌లో రిలీజ్ చేయాలంటే.. ఏదో అరటి తొక్క తీసేసి, పండు తిన్నంత ఈజీ కాదు. అది ఆరోగ్యానికి మంచిదేనా, కలుషితమైందా? ఫలానా జబ్బుని నయం చేయగలుగుతుంతా, లేదా? రసాయనాలన్నీ సముపాళ్లలోనే కలిపారా, లేదా? ఇలా ఎన్నో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒక మెడిసిన్‌ని మార్కెట్‌లోకి వదులుతారు. కానీ.. అవినీతిమయమైన ఈ ప్రపంచంలో ఇప్పుడు కల్తీ మందులు రాజ్యమేలుతున్నాయి. ప్రజల ప్రాణాల్ని లెక్క చేయని కొన్ని ఫార్మా కంపెనీలు, కేవలం తమ జేబులు నింపుకోవడం కోసం నాసిరకం మందుల్ని తయారు చేస్తున్నాయి.
ఇప్పుడు ఓ సంస్థ కూడా అలాంటి చెత్త పనికే పాల్పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. భారత్ నుంచి ఇరాక్‌కు పంపిన ఓ జలుబు మందు కలుషితమైంది, ప్రాణాంతకమైందని తెలిపింది. ఆ మెడిసిన్ పేరు కోల్డ్ ఔట్ కఫ్ సిరప్. ఇది జలుబు, దగ్గుని నివారించే సిరప్. దీనిని మహారాష్ట్రలో ఉండే ఫోర్ట్స్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసింది. ఆ సంస్థ ఈ సిరప్‌ని ఇరాక్‌లో ఉండే డబిలైఫ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌కు సరఫరా చేస్తోంది. 2023 జులై 10వ తేదీన ఈ సిరప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు ఓ ఫిర్యాదు అందింది. దీంతో.. ఇరాక్ నుండి కోల్డ్ అవుట్ సిరప్ నమూనాలని సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపబడింది. ఈ నమూనాను పరీక్షించిన అనంతరం.. ఇందులో ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది.
పరీక్ష కోసం పంపిన నమూనాలో డైథైలిన్ గ్లైకాల్ (0.25%), ఇథిలీన్ గ్లైకాల్ (2.1%) కనుగొనబడ్డాయని WHO వెల్లడించింది. ఈ రెండు రసాయనాలు ఎంతో ప్రాణాంతకమైనవని, ఇవి తీవ్ర ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తాయని తెలిపింది. ఈ సిరప్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే.. ఈ మెడిసిన్ పరీక్షల్లో విఫలమైనప్పటికీ.. దీనిని తయారు చేసే, విక్రయించే కంపెనీలు.. తాము ఈ సిరప్‌ని సురక్షితంగా తయారు చేస్తామన్న గ్యారెంటీ ఇవ్వలేదని WHO విచారం వ్యక్తం చేసింది. కాగా.. గతేడాదిలో భారత్‌లో తయారైన దగ్గు సిరప్ తాగడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో చాలామంది పిల్లలు చనిపోగా.. భారత ప్రభుత్వం ఆయా కంపెనీలకు జరిమానా విధించడంతో పాటు డ్రగ్ లైసెన్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కూడా రద్దు చేసింది.
Updated Date - 2023-08-08T18:42:39+05:30 IST