ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇద్దరు వ్యాపారవేత్తల ప్రచ్ఛన్న యుద్ధంలో బలైన మహువా

ABN, First Publish Date - 2023-12-09T04:09:20+05:30

గల్ఫ్‌ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌, ఇతర దేశాలకు సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాపై ఆధిపత్యం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

గల్ఫ్‌ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌, ఇతర దేశాలకు సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాపై ఆధిపత్యం కోసం.. దుబాయిలోని ఇద్దరు గుజరాతీ వ్యాపార దిగ్గజాల మధ్య జరిగిన పోటీలో ఎంపీ మహువా మొయిత్రా బలయ్యారు! ఆ వ్యాపారులు.. గౌతం అదానీ, దర్శన్‌ హిరానందానీ. వీరిలో అదానీ.. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ఇంజన్‌ఆయిల్‌ సరఫరా చేసే స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. హిరానందానీ స్వతహాగా సంపన్నుడు. ముంబైలో స్థిరాస్తి వ్యాపారం చేసిన అనుభవంతో.. దుబాయ్‌లోనూ ఆ రంగంలో ప్రముఖుడిగా పేరొందారు. కాలక్రమంలో ఆయన విద్యుత్‌, సహజవాయువు సరఫరా వ్యాపారంలో అడుగుపెట్టడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ.. అదే సమయంలో మోదీ సర్కారు పుణ్యమాని గౌతమ్‌ అదానీ ఆ రంగంలో తనతో పోటీపడుతున్న ఏ ఒక్కరికీ అందనంత దూరం దూసుకెళ్లారు. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి వ్యాపారంలో అడుగుపెట్టిన హిరానందానీ.. మోదీ సర్కారు అదానీకి చౌకగా ఇప్పించిన సహాజ వాయువు ఆధారిత విద్యుదుత్పత్తి ధరలతో పోటీపడలేక వెనుకబడ్డారు.

అయినా వెనుదీయక.. చమురు సరఫరాకు కేంద్రబిందువుగా ఉన్న బంగాళఖాతం తీరాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకుని ముందుకు వెళ్లేందుకు ఆయన పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఎంపిక చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు మహువాతో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. అదానీ వ్యాపార లావాదేవీల గురించి పూర్తి అవగాహన ఉన్న హిరానందానీ వాటిని బయటపెట్టేందుకు మహువా పార్లమెంటు లాగిన్‌ వివరాలను ఉపయోగించుకున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉండడంతో ఆమె కూడా అందుకు అంగీకరించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మహువా అడిగే ప్రశ్నలకు, చేసే విమర్శలకు సమాధానాలు చెప్పలేక మోదీ సర్కారు తీవ్రంగా ఇబ్బంది పడింది. అయితే.. పెంపుడుకుక్క విషయంలో మహువాకు, ఆమె మాజీ ప్రియుడికి (సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్‌రాయ్‌.. అతడిని ‘మాజీ’ అని ఆమె స్వయంగా పేర్కొన్నారు) మొదలైన వివాదంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది! దీంతో.. హిరానందానీకి ఆమె లాగిన్‌ వివరాలు ఇచ్చిన విషయాన్ని ఆయన బట్టబయలు చేశారు. ఈ గొడవలో చిక్కుకున్న హిరానందానీ దిక్కుతోచని పరిస్థితిలో నిజాలు వెల్లడించారు. ఫలితంగా మహువాపై బహిష్కరణ వేటు పడింది.

Updated Date - 2023-12-09T06:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising