ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Demonetisation: సుప్రీంకోర్టు ‘నోట్ల రద్దు తీర్పు’పై కాంగ్రెస్ స్పందన ఇదీ.. ఏమన్నదంటే..

ABN, First Publish Date - 2023-01-02T16:48:38+05:30

నోట్ల రద్దు (Demonetisation) నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ (Supreme Court) సమర్థించిందని చెప్పడం తప్పుదోవపట్టించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యాఖ్యానించింది. ఇలా వ్యవహరించడమ తప్పిదమని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నోట్ల రద్దు (Demonetisation) నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ (Supreme Court) సమర్థించిందని చెప్పడం తప్పుదోవపట్టించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యాఖ్యానించింది. ఇలా వ్యవహరించడమ తప్పిదమని పేర్కొంది. నోట్ల రద్దుపై సుప్రీంకోర్ట్ సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ (Jairam Ramesh) మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయ ప్రక్రియతో ముడిపడిన పరిమిత విషయాలు మాత్రమే సుప్రీంకోర్ట్ తీర్పులో ఎక్కువగా ఉన్నాయని, నిర్ణయ ఫలితాలు ఇందులో లేవని జైరామ్ రమేష్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాలు నెరవేరాయా లేదా అనే విషయాలను ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. డిమానిటైజేషన్‌పై తీర్పులో సుప్రీం జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. నిర్ణయాల విషయంలో చట్టవిరుద్ధంగా, నిబంధనలు అతిక్రమించి ముందుకు పోరాదనే విషయాన్ని సుప్రీంకోర్ట్ తీర్పు నొక్కిచెప్పినట్టయ్యిందని పేర్కొన్నారు.

కాగా 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్ట్ బెంచ్ 4:1 మెజారిటీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా నల్లధనం (Black money), నకిలీ కరెన్సీ(Fake currency), పన్ను ఎగవేతలు, ఉగ్రవాద మూకలకు నిధులు చేరకుండా నియంత్రించడమే లక్ష్యంగా నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును (demonetisation) ప్రకటించింది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే చలామణిలోని రూ.10 లక్షల కోట్ల విలువైన కరెన్సీ తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-02T16:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising