ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress : ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌దే పీఠం!

ABN, First Publish Date - 2023-11-20T00:40:07+05:30

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రె్‌సదే మరోసారి అధికార పీఠం అనే అంచనాలు అధికమయ్యాయి. బీజేపీతో పోటీ పడి ఇచ్చిన ఉచిత పథకాలు, రుణ మాఫీ హామీలే ఈ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు గేమ్‌ చేంజర్‌గా పని

రాజకీయ విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రె్‌సదే మరోసారి అధికార పీఠం అనే అంచనాలు అధికమయ్యాయి. బీజేపీతో పోటీ పడి ఇచ్చిన ఉచిత పథకాలు, రుణ మాఫీ హామీలే ఈ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు గేమ్‌ చేంజర్‌గా పని చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఐదు లేదా ఆరు సీట్ల కంటే ఎక్కువ ఆధిక్యం ఆ పార్టీకి వచ్చే అవకాశం లేదని అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లలో కాంగ్రె్‌సకు 50-51 సీట్లు, బీజేపీకి 35 సీట్లు, ఇతరులకు ఐదు లేదా ఆరు సీట్లు వస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీపడి మరీ జనాకర్షక పథకాలను ప్రకటించాయి. వివాహితులైన మహిళలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తామని బీజేపీ ప్రకటించింది.

ఇందుకు బదులుగా 18 ఏళ్లు దాటిన ప్రతి స్త్రీకి రూ.15 వేలు చొప్పున బదిలీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇందుకు పోటీగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో పుట్టిన ప్రతి బాలికకు రూ.15 లక్షలు చెల్లిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. అన్ని కుటుంబాలకూ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రక టిస్తే ఈ అంశంలో బీజేపీ మౌనం వహించింది. రాష్ట్ర ప్రజలందరికీ రూ.10 లక్షల చొప్పున ఉచిత ఆరోగ్య సేవలందిస్తామని బీజేపీ హామీ ఇస్తే .. ఈ ఉచిత ఆరోగ్య సేవలను ప్రమాదాలకు కూడా వర్తింప చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈ హామీలే కాంగ్రె్‌సకు తిరిగి అధికారాన్ని తెచ్చిపెట్టబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-20T00:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising