ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘టిండర్‌’ క్రైమ్‌ కథాంతం

ABN, First Publish Date - 2023-11-26T03:00:49+05:30

టిండర్‌.. ఈ ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ గురించి తెలియని యువత ఉండరు. అపరిచిత వ్యక్తుల్లో తమ అభిరుచులకు సరిపోయే వారిని జోడీగా చేసుకునేందుకు యువతి, యువకులు టిండర్‌ వాడుతుంటారు.

డేటింగ్‌ యాప్‌లో యువకుడికి యువతి ఎర

డబ్బు కోసం ప్రియుడితో కలిసి హత్య

నిందితులు ముగ్గురికి యావజ్జీవ శిక్ష

న్యూఢిల్లీ, నవంబరు 25 : టిండర్‌.. ఈ ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ గురించి తెలియని యువత ఉండరు. అపరిచిత వ్యక్తుల్లో తమ అభిరుచులకు సరిపోయే వారిని జోడీగా చేసుకునేందుకు యువతి, యువకులు టిండర్‌ వాడుతుంటారు. అలాంటి ఈ టిండర్‌ యాప్‌లో ఓ యువతి రక్తచరిత్ర లిఖించింది. తన ప్రియుడికి ఆర్థిక సాయం చేసేందుకు టిండర్‌ ద్వారా మరో యువకుడికి దగ్గరై డబ్బు కోసం కిడ్నాప్‌ చేసి ఆపై కిరాతకంగా చంపేసింది. చివరికి తన ప్రియుడు, మరొకరితో కలిసి కటకటాలపాలైంది. ఈ క్రైమ్‌ కథ టిండర్‌లో 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వివాహితుడైన దుష్యంత్‌ శర్మ(28).. వివాన్‌ కోహ్లీ పేరిట టిండర్‌లో ఓ నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. తాను ఢిల్లీలో ఓ బడా వ్యాపారవేత్తనని పేర్కొన్న దుష్యంత్‌కు ప్రియ సేథ్‌(27) అనే యువతి టిండర్‌లో పరిచయమయింది. మూడు నెలల తర్వాత ఓ రోజు దుష్యంత్‌కు ఫోన్‌ చేసిన ప్రియ నేరుగా కలుద్దామని పిలిచింది. ప్రియను గుడ్డిగా నమ్మి దుష్యంత్‌ ఆమె చెప్పిన చోటుకి వెళ్లాడు. మరోపక్క, దిక్షాంత్‌ కమ్రా అనే యువకుడితో ప్రియ అప్పటికే లివిన్‌ రిలేషన్‌షి్‌పలో ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన దిక్షాంత్‌ను కాపాడేందుకు ప్రియ ఓ పథకం వేసింది. ఈ ప్లాన్‌కు దొరికిపోయిన దుష్యంత్‌.. ప్రియ చెప్పిన చోటుకు రాగానే వారు అతన్ని బంధించారు. దుష్యంత్‌ ధనవంతుడు కాదని తెలుసుకున్న వారు అతని తండ్రికి ఫోన్‌ చేసి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. లేదంటే కొడుకుని చంపేస్తామని బెదిరించారు. తాను అంత ఇచ్చుకోలేనన్న ఆయన రూ.3 లక్షలు సమకూరుస్తానని వారికి హామీ ఇచ్చాడు. ఆ డబ్బు అందేలోపే దుష్యంత్‌ను చంపేయాలని భావించిన వారు పీక నొక్కి, దిండుతో ఊపిరాడకుండా చేశారు. కానీ ప్రాణం పోకపోవడంతో దిక్షాంత్‌ కత్తితో దుష్యంత్‌ పీక కోసేశాడు. 2018 మే 4న దుష్యంత్‌ మృతదేహం లభించగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జైపూర్‌ న్యాయస్థానం శనివారం ముగ్గురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Updated Date - 2023-11-26T03:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising