ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cyclone Michaung: తుపాను బాధితులకు ఆపన్న హస్తం.. ఆదుకున్న భారత వైమానిక దళం

ABN, First Publish Date - 2023-12-07T11:06:50+05:30

మిచాంగ్ తుపాన్ ప్రభావంతో వణుకుతున్న చెన్నై నగరానికి భారత వైమానిక దళం(IAF) ఆపన్నహస్తం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ 2,300 కిలోల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది.

చెన్నై: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో వణుకుతున్న చెన్నై నగరానికి భారత వైమానిక దళం(IAF) ఆపన్నహస్తం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ 2,300 కిలోల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది. ఐఏఎఫ్ తో కలిసి తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీలు సహాయక సామగ్రిని అందిస్తున్నాయి.

IAFకి చెందిన నాలుగు చేతక్ హెలికాప్టర్లు దక్షిణ చెన్నైలో మెదవాక్కం నుండి పుజుడివాక్కం మెట్రో స్టేషన్ వరకు 8 ప్రదేశాలను కవర్ చేశాయి. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ చేతక్ హెలికాప్టర్లలో అధికారులు చెన్నైలోని వెస్ట్ తాంబరం, ముడిచూర్, వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. పల్లికరణై, తోరైపాక్కం ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టారు. పాలు, నీరు, బ్రెడ్, బిస్కెట్లు, కిరాణా సామగ్రిని ఇస్తున్నట్లు స్థానికులుచెబుతున్నారు.

బుధవారం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. "చెన్నై శివార్లు ఇంకా వరద ముంపు ఎదుర్కుంటూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ ఆహారం, పాలు వంటి నిత్యావసరాలు అందేలా చూస్తున్నాం. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాం" అని సీఎం తన ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు.

Updated Date - 2023-12-07T11:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising