ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manish Sisodia: ఎమ్మెల్యే ఫండ్ విడుదల చేసేందుకు సిసోడియాకు కోర్టు అనుమతి

ABN, First Publish Date - 2023-08-22T17:46:06+05:30

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సీబీఐ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

న్యూఢిల్లీ: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధుల విడుదలకు అనుమతి కోరుతూ గతంలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా కోర్టు అనుమతించిన విషయాన్ని సిసోడియా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సీబీఐ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.


ఎమ్మెల్యేలందరికీ నెలసరి వేతనంతో పాటు, తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఫండ్స్ కేటాయిస్తుంటారు. రూ.1 కోటి నుంచి 8 కోట్ల వరకూ వార్షికంగా ఎమ్మెల్యే ఫండ్ కేటాయింపులు ఉంటాయి. కాగా, ప్రస్తుతం సిసోడియాపై కొనసాగుతున్న ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసును రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 20 వరకూ వాయిదా వేసింది. సుప్రీంకోర్టు సైతం బెయిలు కోరుతూ సిసోడియా చేసిన విజ్ఞప్తిపై ఈడీకి మరికొంత వ్యవధి ఇస్తూ గత ఆగస్టు 4న బెయిల్ పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ వరకూ వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిలు అప్లికేషన్లను ఇంతకుముందు దిగువ కోర్టులు తోసిపుచ్చాయి. ఈ తీర్పులను సిసోడియా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2023-08-22T19:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising