Delhi:ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్
ABN, First Publish Date - 2023-10-13T12:38:56+05:30
ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతారని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతారని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ రాయబార(Embassy) కార్యాలయం, యూదు మత సంస్థల చుట్టూ ఉన్న సున్నిత ప్రాంతాలలో కూడా వారు గస్తీ కాస్తున్నారు. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరుల భద్రత కోసం భద్రతా సంస్థలు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశాయి. ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు, సిబ్బంది, పర్యాటకులకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్ తో పాటు.. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో యూదు, పాలస్తీనా అనుకూల వ్యక్తులకు భద్రత పెంచారు. అదే టైంలో భారత్ ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన 211 మంది పౌరులను స్వదేశానికి సేఫ్ గా తీసుకువచ్చింది. ఇజ్రాయెల్ - పాలస్తీనా(Israel- Palestine) మధ్య యుద్ధం తగ్గకపోవడంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 2వేల మంది చనిపోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
ప్రాణాలు తీసే కెమికల్స్‌ని ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్
అదే టైంలో ఇజ్రాయెల్-పాలస్థీనా మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది. వారి వివరాల ప్రకారం.. గాజా, లెబనాన్‌లపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ దళాలు ఆయుధాల్లో ప్రమాదకర తెల్ల భాస్వరం(White Phosphorus) వాడుతున్నట్లు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ కెమికల్ ఆయుధాలు వాడితే బాధితులు తీవ్ర గాయాలపాలయ్యి, దీర్ఘకాలిక జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం వివరణ కోరగా.. తెల్ల భాస్వరం కలిగిన ఆయుధాలను(Weapons) ఉపయోగించట్లేదని వెల్లడించింది. అయితే ఆ సంస్థ కెమికల్ ఉపయోగించారనడానికి సాక్ష్యాధారాలను చూపుతోంది. వాటి వాడకాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ని కోరుతోంది.
Updated Date - 2023-10-13T12:40:08+05:30 IST